కేంద్రం అనుమతి లేకుండా మెడికల్ కాలేజీల నిర్మాణం ఎలా నిర్మాణం చేస్తున్నారో సీ.ఎం సమాధానం చెప్పాలి.
కేంద్రం అనుమతులేని మెడికల్ కాలేజీలు ఎలా నిర్మాణం చేస్తావంటూ నర్సీపట్నంలో సీ.ఎం ను ప్రశ్నించిన మాజీ మంత్రి అయ్యన్న రాష్ట్రంలో ఇప్పటికే 16 మెడికల్ కాలేజీలకు శంఖుస్థాపన చేశారు.వీటిలో కేవలం ఏడు కాలేజీలే కావాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.వాటిలో మూడింటికే అనుమతి వచ్చింది.కేంద్రం ఆమోదం లేకుండా మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయగలరా??దీనిపై నర్సీపట్నం సభలో సీ.ఎం సమాధానం చెప్పాలి.
గత ప్రభుత్వ హాయాంలో మంజూరై, సగం సగం పూర్తయిన పనులు పదుల సంఖ్యలో వున్నాయి.ఉత్తరాంద్ర వరం… సుజల స్రవంతి ఎంత వరకు వచ్చిందో ప్రజలకు చెప్పాలి…