ఆధార్‌ కార్డుపై మీ ఫోటోను ఇలా మార్చుకోండి!

ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం.భారతీయ గుర్తిపుతోపాటు ఏవైనా సంక్షేమ పథకాలు పొందాలన్నా ఈ కార్డు లేనిదే పొందలేరు.

మన ఐడెంటిఫికేషన్‌కు ఇది చాలా అవసరం.ఇటీవల ఆధార్‌ కార్డు దరఖాస్తులు, పేరు, అడ్రస్‌ ఇతర మార్పుల కోసం మీ సేవ సెంటర్ల వద్ద గంటల కొద్ది గుమిగూడుతున్నారు.

ఇప్పటికే అడ్రస్‌ మార్పు ఎలా చేసుకోవచ్చో తెలుసుకున్నాం.ఇప్పుడు ఆధార్‌ కార్డుపై ఉన్న పాత ఫోటోను ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.

సాధారణంగా ఆధార్‌ కార్డుపై ఏళ్ల కిందట దిగిన ఫోటో ఉంటుంది.అది కాస్త బ్లర్‌గా మిమ్మల్ని మీరే గుర్తించని విధంగా ఉండవచ్చు.

Advertisement
Can Easily Change The Photograph On The Aadhar Card, Aadhar Card, Apply Aadhar C

మీరు ఒకవేళ ఆ ఫోటోను మార్చుకోవాలనుకుంటే ఏ మీ సేవల సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.కేవలం ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్‌లో మార్పు చేసుకోవచ్చు.

ఆధార్‌కార్డును బ్యాంక్‌ ఖాతాలకు , వెహికల్స్‌ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్‌ పాలసీలకు కూడా వాడతాం.దీనిపై వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, లింగం, అడ్రస్, ఫోటో ఉంటుంది.

కొన్ని సులభ పద్ధతుల ద్వారా ఈజీగా ఆధార్‌ కార్డును అప్డేట్‌ చేసుకోవచ్చు.ఫోటోను ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌ లేదా ఆధార్‌ సేవ కేంద్రాల ద్వారా అప్డేట్‌ చేయవచ్చు.

ఈ కింది విధాంగా ఆధార్‌ కార్డుపై ఫోటోను మార్చుకోవచ్చు.ఇది చాలా సులభంగా మార్చుకోవచ్చు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

దీనికి ఎటువంటి ధ్రువ పత్రాలు అవసరం లేదు.

Can Easily Change The Photograph On The Aadhar Card, Aadhar Card, Apply Aadhar C
Advertisement

ఆధార్‌ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి.ఆధార్‌ కార్డుపై ఫోటో మార్పునకు సంబంధించిన పత్రాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది.ఆ దరఖాస్తు పత్రాన్ని ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఎగ్జుక్యూటీవ్‌కు సబ్మిట్‌ చేయాలి.

మీకు దగ్గరలో ఉన్న ఆధార్‌ ఎన్‌రోల్‌ మెంట్‌ సెంటర్‌కు ఫోటో మార్పునకు తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది.ఈ ప్రక్రియకు నిర్ణిత ఫీజు ఉంటుంది.ఆధార్‌ సెంటర్‌లో మీ ఫోటోను సంబంధిత సిబ్బంది తీసుకుంటారు.

దీంతో ఫోటో అప్‌లోడ్‌ చేస్తారు.దీనికి సంబంధించిన అప్డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌(యూఆర్‌ఎన్‌)స్లిప్‌ను ఇస్తారు.

ఆ యూఆర్‌ఎన్‌ ద్వారా ఆధార్‌ అప్డేట్‌ స్టేటస్‌ను యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్లో చెక్‌ చేసుకోవచ్చు.

తాజా వార్తలు