బెంగుళూర్ టీమ్ ఈసారి కప్పు గెలిచే అవకాశం ఉందటరా..?

ఐపీఎల్ సీజన్ 17 ( IPL Season 17 )లో భాగంగా ప్రస్తుతం ప్రతి టీం కూడా తమదైన రీతిలో మ్యాచ్ లు ఆడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆర్ సి బి టీం ప్లేయర్లు అయినా విరాట్ కోహ్లీ, డూప్లిసిస్, విల్ జాక్స్, దినేష్ కార్తీక్ లాంటి ప్లేయర్లతో ఈ టీమ్ చాలా స్ట్రాంగ్ గా కనిపించినప్పటికీ వీళ్ళు ఆడిన 9 మ్యాచ్ ల్లో కేవలం రెండు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించారు.

బెంగళూరు టీమ్ బ్యాటింగ్ బాగా చేసినప్పటికీ బౌలింగ్ లో మాత్రం తేలిపోతున్నారు.

ఇక ఎట్టకేలకు హైదరాబాద్ టీం పైన ఒక భారీ విక్టరీని సాధించిన బెంగళూరు టీం( Bangalore team ) తొమ్మిది మ్యాచ్ లు ఆడితే అందులో రెండు మ్యాచ్ లు మాత్రమే విజయం సాధించి, నాలుగు పాయింట్లతో పదోవ పొజిషన్ లో కొనసాగుతున్నారు.ఇక ఇదిలా ఉంటే వీళ్లు సెమీఫైనల్ కి వెళ్లడం చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పటికే ఉన్న ప్రతి టీం కూడా సెమిస్ రేస్ లో ముందంజ లో ఉన్నప్పటికీ బెంగళూరు మాత్రం అందరికంటే తక్కువ మ్యాచులు గెలిచి చిట్ట చివరి ప్లేస్ లో కొనసాగుతుంది.

ఇకమీదట వీళ్ళు ఆడబోయే అన్ని మ్యాచ్ ల్లో గెలిచినా కూడా వీళ్లకు సెమీస్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి.

Advertisement

ఈ లెక్కన సోషల్ మీడియా మొత్తంలో ఆర్సిబి టీం( RCB team ) ఈసారైనా కప్పు గెలవాలని ఆ టీమ్ అభిమానులు చాలా అంచనాలైతే పెట్టుకున్నారు.కానీ ఈసారి కూడా ఈ టీమ్ కప్పు గెలిచే అవకాశాలైతే కనిపించడం లేదు.ఇక ఇదిలా ఉంటే ఈసారి బెంగళూరు లేడీస్ టీం కప్పు కొట్టి చూపించింది.

ఇక దాంతో ఐపీఎల్ లో కూడా వీళ్లు కప్పు కొడతారని అందరూ అనుకున్నారు.కానీ ఒక మ్యాచ్ గెలవడానికే వీళ్ళు నా నా తంటాలు పడుతుంటే ఇక కప్పు కొట్టడం దేవుడెరుగు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు