ఒకప్పటి తెలుగు సినీ అగ్ర హీరోయిన్ లలో ఒకరైన సి.కృష్ణవేణి( C.
Krishnaveni ) చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.కాగా కృష్ణవేణి మొదట సతీ అనసూయ అనే సినిమాతో 1940లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
కాగా ఈమె తెలుగు నిర్మాత అయిన మీర్జాపురం రాజాని( Rajani of Mirzapuram ) పెళ్ళి చేసుకొని, ఆ తర్వాత సినిమాలకి నిర్మాతగా వ్యవహరించింది.తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషికి గాను 2004 లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు.
ఇకపోతే తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే హీరోలలో నందమూరి తారక రామారావు కూడా ఒకరు.
సినిమాల పరంగానే కాకుండా రాజకీయపరంగా కూడా విజయం సాధించారు నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ).కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అటువంటి గొప్ప నటుడిని తెలుగు వారికి పరిచయం చేసిన నటి నిర్మాత కృష్ణవేణి అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవేణిని ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.శకపురుషుడు శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఈ ఏడాది జరుగుతున్న విషయం తెలిసిందే.
మన దేశం సినిమాలో ఎన్టీఆర్ గారిని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గా పరిచయం చేశారు? ఎలా తీసుకున్నారని అడుగగా.
కృష్ణవేణి స్పందిస్తూ.ఎల్వీ ప్రసాద్ ( LV Prasad )గారికి, ఎన్టీఆర్ గారు ఎలా పరిచయమో నాకు తెలియదు.కానీ మా ఆయన నా దగ్గరకి వచ్చి నువ్వు ఈ పొలిటికల్ సినిమా తీయడం నాకు నచ్చలేదు అని చెప్పాడు.
ఆ తర్వాత నేను స్టుడియోకి వెళ్ళాను.అప్పడే అక్కడ ఎల్వీ ప్రసాద్ గారు, ఎన్టీఆర్ గారు కూర్చున్నారు.ఏమిటని నేను అడుగగా మన సినిమాకి పోలీస్ ఇన్స్పెక్టర్ వేషం కోసం ఇతడిని తీసుకొచ్చానని ఆయన చెప్పగానే ఆయనని చూసి అలానే చూస్తుండిపోయాను.ఆ తర్వాత మా మేనేజర్ ని పిలిచి చెక్ మీద సంతకం చేసి ఇచ్చేసి వెళ్తుండగా ఎన్టీఆర్ నన్ను ఆగమని చెప్పి నా చేతుల మీదుగా చెక్కు ఇవ్వమని చెప్పారు.
నేను నా చేతులమీదుగా చెక్ ఎన్టీఆర్ కి ఇచ్చాను అని చెప్పుకొచ్చారు సి.కృష్ణవేణి.మన దేశం సినిమాకి ఎన్టీఆర్ ఎన్ని రోజులు పని చేశారో తెలుసా అని అడుగగా చాలా రోజులే పని చేశారు.కానీ ఆయన షూటింగ్ కి వచ్చిన మొదటి రోజునే ఏదో బాగా అనుభవం గల నటుడిగా అనిపించాడని సి.కృష్ణవేణి చెప్పారు.మన దేశం సినిమా తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని కలిసారా అని అడుగగా ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా నేను కనిపిస్తే చాలు, గబుక్కున లేచి ఈవిడ నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ గారండి అని అందరికి చెప్తుంటే ఎంతో బాగుండేది.
నాకు ఒక సంతృప్తి అని సి.కృష్ణవేణి చెప్పారు.ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా షూటింగ్ టైంలో ఎలా ఉండేవారో చెప్పుకొచ్చారు.ఇంటర్వ్యూలో భాగంగా కృష్ణవేణి మాట్లాడిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.