తెలంగాణలో రేపటి నుంచి న్యూట్రిషన్స్ కిట్స్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.గర్భిణీలకు 4వ మరియు 7వ నెలలో కిట్లు అందిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చాక ప్రభుత్వాస్పత్రులను అభివృద్ది చేసుకున్నామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.70 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రులలోనే జరుగుతున్నాయని చెప్పారు.మహిళలపై వేధింపులు నివారించేందుకే షీ టీమ్స్ ను తీసుకొచ్చామని తెలిపారు.