ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.ఈ నాటకం వెనుక ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారన్నారు.
ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని తెలిపారు.నలుగురు ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వం కూలిపోతుందా అని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌజ్ లో డీల్ జరుగుతుండగా పోలీసులు ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అయితే బీజేపీ నేతలే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది.







