బిగ్ బాస్ షో గురించి, బిగ్ బాస్ షో కి ఉన్న పాపులారిటీ గురించి మనందరికీ తెలిసిందే.ఇక బిగ్ బాస్ షో తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ షో కి తెలుగులో కూడా విపరీతమైన పాపులారిటి దక్కింది.ఇకపోతే ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షోలో ప్రస్తుతం 6 వ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 8 వ వారం కెప్టెన్సీ కంటెడర్స్ టాస్క్ జరుగుతోంది.ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ కు చేపల చెరువు అని టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్.
ఈ టాస్క్ మధ్యలో కొన్ని కొత్త ఛాలెంజ్ లు విసరుతు ఉండడంతో కంటెస్టెంట్లు ఒళ్ళు హునం అయ్యే విధంగా ఒకరి పై ఒకరు పడి లేస్తూ ఈ టాస్క్ లో కసిగా ఆడుతున్నారు.కెప్టెన్సీ బరిలో నిలిచేందుకు జంటలు పోటీపడి మరీ ఆడుతున్నారు.
అయితే ఈ గేమ్ చివరిలో కంటెస్టెంట్లకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.ఇంట్లోకి ఓ నల్ల చేప వచ్చింది, దాని సహాయంతో రెండు జంటల బాస్కెట్ లను స్వాప్ చేయవచ్చని మెలిక పెట్టాడు.
బిగ్ బాస్ చెప్పిన ఆ నల్ల చేప గీతూ కి దొరికింది.దాంతో గీతూ, రేవంత్ – ఇనయ జోడి ల బాస్కెట్ ను శ్రీహన్ -శ్రీ సత్య జంటతో స్వాప్ చేస్తున్నట్లు తెలిపింది.

అయితే గేమ్ లో అంత కష్టపడి ఆడినాకూడా గీతూ ఒక చేప తో తమ గేమ్ నుంచి సైడ్ చేయడం ఇనయ, రేవంత్ కి నచ్చలేదు.దాంతో వారు బాధతో కోపంతో మాట్లాడుతుంటే వారిపై కౌంటర్లు వేస్తూ సంతోషపడింది గీతూ.కాగా మొత్తానికి ఈ టాస్క్ లో గేమ్ చేంజర్ గీతూ అంటూ హాట్ స్టార్ ట్వీట్ చేయగా,కొందరు గేమ్ స్పాయిలర్ అని కామెంట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు ప్రశ్నిస్తూ.
మొదటి రౌండ్ లోనే గీతు అవుట్ అయిపోయింది కదా మరి ఆ నల్ల చేప ఎలా దొరికింది? అది ఎలా సాధ్యం అంటూ బిగ్ బాస్ పై మండిపడుతున్నారు నెటిజన్స్.







