టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం లైగర్.అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.కానీ ఈ సినిమా విడుదల అయ్యి ఒక్కసారిగా డిజాస్టర్ అవడంతో విజయ్ పై, దర్శకుడు పూరీ జగన్నాథ్ పై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్స్ చేశారు.
అంతేకాకుండా ఈ సినిమా డిజాస్టర్ అయ్యి భారీ నష్టాలను తెచ్చి పెట్టింది
దీంతో పలువురు డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బును వెనక్కి తిరిగి ఇవ్వాలి అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ ని , నిర్మాత చార్మీ ని డిమాండ్ చేశారు.అప్పుడు పూరి ఒక నెల రోజులు గడువు ఇవ్వమని అడిగినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి రెడీ అవడంతో వెంటనే స్పందించిన పూరీ జగన్నాథ్ తన పరువు తీయాలని ప్రయత్నిస్తే ఒక్క పైసా కూడా ఇవ్వను అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
కాగా అందుకు సంబంధించిన ఆడియో కాల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వ్యవహారం పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ.దర్శకుడు పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే లైగర్ సినిమా హక్కులు కొనమని వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగాడా? లేదు కదా! మరి కొన్నవాడిదే తప్పు.అంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయినప్పుడు అంత పెద్ద మొత్తానికి కొనడం ఎందుకు? నష్టాలు వచ్చాయని డబ్బులు వెనక్కి ఇవ్వమని డిమాండ్ చేయడం ఎందుకు? లాభాలు వస్తాయి అని పెద్ద సినిమాలు కొన్నప్పుడు నష్టం వచ్చినా కూడా డిస్ట్రిబ్యూటర్స్ భరించాలి అని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.







