సాధారణంగా రైళ్లలో జంతువులు కనిపించడం చాలా అరుదు.ఎందుకంటే ట్రైన్ లోకి తీసుకొస్తే జంతువులు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవచ్చు.
ఒకవేళ జంతువులను తీసుకురావాలన్నా రైల్వే అధికారుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి.అయితే తాజాగా ఎవరి పర్మిషన్ లేకుండా ఒక రైలులోని బోగీలోకి ఎద్దు ఎక్కింది.
ఈ దున్నపోతు రైలు బోగీలో నిల్చొని ప్రయాణికుల గుండెల్లో గుబులు రేపింది.ఈ ఎద్దు ట్రైన్ ఎక్కడమే ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే.
అది కరెక్ట్‌గా దిగాల్సిన స్టేషన్ లో దిగిపోయింది.వినడానికి ఇదంతా నమ్మశక్యంగా లేకపోయినా.
ఇది నిజంగానే జరిగింది.జార్ఖండ్‌లో మీర్జాచౌకి నుంచి సాహిబ్‌గంజ్‌కు వెళ్తున్న ఒక ట్రైన్ లో ఈ ఎద్దు నిజంగానే ఎక్కింది.
అయితే ఈ వింత దృశ్యం చూసి ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.అది తమపై దాడి చేస్తుందేమోనని ఇంకొందరు హడలిపోయారు.కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.దాంతో షాకింగ్ విషయం అందరికీ తెలిసింది.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం, 12 మంది గుర్తుతెలియని వ్యక్తులు ఈ దున్నపోతును మీర్జా చౌకి రైల్వేస్టేషన్‌లో ఆగిన ఓ ట్రైన్ బోగీలో ఎక్కించారు.దానిని ఒక సీటు హ్యాండిల్‌కు తాడుతో కట్టేశారు.
చివరి స్టేషన్ అయిన సాహిబ్‌గంజ్ లో ఈ బర్రెను దించేయాలని ప్రయాణికులకు చెప్పి ట్రైన్ దిగి వెళ్లిపోయారు.

అయితే ఈ దృశ్యాలను ఒక వ్యక్తి వీడియో తీశాడు.మరొక వ్యక్తి కెమెరా ముందుకు వచ్చి ఈ బర్రెను ఇలా కట్టేశారని, ఫలానా చోట దించాలని చెప్పారని తెలిపాడు.ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇదేం విడ్డూరం అని మరికొందరు నోరెళ్లబెడుతున్నారు.ఇంకొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియో మీరు కూడా ఓ లుక్కేయండి.







