Buddha Venkanna : చంద్రబాబు సీట్లు అమ్ముకున్నారని నాని చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గం – బుద్దా వెంకన్న

విజయవాడ:టీడీపీ నేత బుద్దా వెంకన్న.( Buddha Venkanna ) టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారు.

 Buddha Venkanna Shocking Comments On Kesineni Nani-TeluguStop.com

మొన్నటి వరకు కొడాలి నాని మొరిగేవాడు.ఇప్పుడు కేశినేని నాని( Kesineni Nani ) కుక్కలా మొరుగుతున్నాడు.

చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని వాగుతున్నాడు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోపిడీ దారుల్లో ముందు వరులో ఉంటాడు.

కేశినేని నాని సత్యహరిశ్చంద్రుడిలా పెద్ది రెడ్డి మాట్లాడుతున్నాడు.ఇలాంటి నీచ, నికృష్ట సీఎం ను నా జీవితంలో చూడలేదని కేశినేని నాని అన్నాడు.

పెద్ది రెడ్డి అన్నట్లు చంద్రబాబు గురించి నాని చెప్పింది నిజమైతే.జగన్ గురించి అదే నాని మాట్లాడింది కూడా నిజమని అంగీకరిస్తారా.

కేశినేని నాని పరమ వెధవ.ఒక్కటి కూడా నిజం చెప్పడు.

వసంత కృష్ణప్రసాద్ కు రాజకీయ చరిత్ర ఉంది.ఆయన తండ్రి హోంమంత్రిగా చేశారు.

కేశినేని నాని వంటి అబద్దాల కోరు రాకతో.వసంత కృష్ణప్రసాద్ బయటకు వచ్చారు.

వసంత గతంలోనే చంద్రబాబును విమర్శించను అని బహిరంగంగా చెప్పాడు.కేశినేని నాని తో తిరిగితే.తనకు ఓటమి తప్పదనే వసంత వైసీపీని వీడాడు.దున్నపోతులా బలిసి, లావు చూసి బలం అనుకుంటున్నాడు.కేశినేని నాని.నీ వెనుక పట్టుమని పది మంది వెళ్లేలదు.చంద్రబాబును విమర్శిస్తావా.విజయవాడ పశ్చిమ విషయంలో రాజీనామా చేస్తానని చంద్రబాబును ( Chandrababu Naidu ) బ్లాక్ మెయిల్ చేశాడు.

నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న సమయంలో నాని ఒక్క సమావేశం కూడా పెట్టలేదు.కేశినేని నాని, వెల్లంపల్లి లు మధ్య లోపాయికారి ఒప్పందాలు గతంలోనే ఉన్నాయి.

అందుకే టీడీపీలో ఉంటూ నాని కోవర్టు రాజకీయాలు చేశాడు.ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇప్పిస్తామని చెప్పి.

ఇద్దరు దగ్గర కేశినేని నాని డబ్బులు తీసుకున్నాడు.

Telugu Buddha Venkanna, Chandrababu, Cmjagan, Gadde Ram Mohan, Kesineni Nani, Td

కేశినేని నానీని రోడ్డు మీదకు వదలాలంటే… ముందు అతని అప్పులు తీర్చాలి.జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy ) కూడా చెబుతున్నాం.ముందు నాని అప్పులు తీర్చి.

అప్పుడు సీటు ఇవ్వాలి.చంద్రబాబు సీట్లు అమ్ముకున్నారని నాని చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గం.

వీడి నోటి వెంట ఒక్క మాట కూడా నిజం రాదు.క్యారెక్టర్ లెస్ ఫెలో కేశినేని నాని.2019 లో నాని దగ్గర డబ్బులు లేకపోయినా.పిలిచి మరీ ఎంపీ సీటు చంద్రబాబు ఇచ్చారు.

ఇప్పుడు సిగ్గు లేకుండా డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని వాగుతున్నాడు.నిన్న మైలవరం ఇన్ ఛార్జిగా వచ్చిన వ్యక్తి నుంచి కూడా నాని డబ్బులు వసూలు చేస్తాడు.

జాగ్రత్తగా ఉండండి.పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని నాని ఎంతమందికి సాయం చేశాడో చెప్పాలి.

నాని మైలవరం ఇన్ ఛార్జిగా ఇప్పుడు అక్కడ కూడా అందినకాడికి దోచుకోవడం ఖాయం.జగన్ కు ఉన్న మెంటాలిటీకీ.కేశినేని నాని బలం ఎంతో అర్దమైపోయి ఉంటుంది.నాని పార్టీ మారాక నీ బలం ఎంతో చూపించలేకపోయాడు.

అసలు లేని బలాన్ని ఎలా చూపిస్తాడు.నాకు తెలిసి వైసీపీలో అతనికి రేపు టిక్కెట్ కూడా ఉండదు.

కేశినేని నాని వల్ల వైసీపీ కి అదనపు బరువే తప్ప.బలం కాదు.

కేశినేని చిన్ని టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటే.నాని ఓర్వలేకపోయాడు.

చివరకు సోదరుడు, అతని కుటుంబం పై స్టిక్కర్ కేసు పెట్టిన మూర్కుడు కేశినేని నాని.కేశినేని నాని వెనుక అతని తల్లి, చెల్లి కూడా లేరు.

గద్దె రామ్మోహన్ రెండు సార్లు నా వల్లే గెలిచాడని నాని చెప్పుకుంటున్నాడు.గద్దె రామ్మోహన్ ఇండిపెండెంట్ గా, టీడీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనది.

విజయవాడ నగర అద్యక్షుడిగా గద్దె రామ్మెహన్ ఆరేళ్లు వరుసగా పని చేసిన చరిత్ర అతనిది.

గద్దె నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు 17వేలు మెజారిటీ వస్తే, కేశినేని నానికి 12వేలు మెజారిటీ వచ్చింది.

కేశినేని నానికి ముని శాపం ఉంది.వాడు మాట్లాడే ప్రతి మాట అబద్దమే.

ఆ అబద్దాలను నమ్మి ప్రచారం చేయవద్దని మీడియాను కూడా కోరుతున్నాం.కేశినేని నాని నిందలు వేస్తే.

అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన పెద్దిరెడ్డి సమర్ధించడం వింతగా ఉంది.గనుల వ్యాపారం చేసే పెద్దిరెడ్డికి అదేశాఖ ఇచ్చి దోచుకోమని జగన్ అనుమతి ఇచ్చాడు.

ఇలాంటోళ్లంతా కలిసి నాని వంటి కుక్కతో మొరిగిస్తున్నారు.చంద్రబాబు నాతో ఎందుకు మాట్లాడిస్తారు.

నేను ఆయనకు వీర విధేయుడిని.మా అధినేతను తిడితే.

నా లాంటోడు చూస్తూ ఊరుకుంటాడా.తగిన బుద్ది చెబుతాం.

కేశినేని నాని ముందు నువ్వు అప్పులు తీర్చి.అప్పుడు ప్రజల్లోకి రా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube