విజయవాడ: టిడిపి నేత బుద్దా వెంకన్న కామెంట్స్.చంద్రబాబు పర్యటన కు లారీ అడ్డం పెట్టి అడ్డుకుంది ఎవరు.
ఆ లారీని పక్కకు తీస్తుంటే టిడిపి కార్యకర్తలు పై పోలీసులు లాఠీఛార్జి చేశారు.రోడ్డుకు లారీ అడ్డం పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారా.
పధ్నాలుగేళ్లు సిఎంగా ఉన్న చంద్రబాబు ను అడ్డుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారు.పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు పనిచేశారు.
మా అధినేత మీదకు వస్తే చూస్తూ ఊరుకోవాలా.ఈ ఘటనలో పోలీసులు గాయపడటం బాధాకరం.
ఆ జిల్లా ఎస్పీ వైసిపి నాయకుడిలా మాట్లాడుతున్నారు.పోలీసు అధికారుల సంఘానికి టిడిపి నాయకులే గుర్తు వస్తారా.
మీ అధికారులను బూతులు తిట్టిన మంత్రులును ఎందుకు ప్రశ్నించలేదు.చంద్రబాబు ను వ్యక్తిగతంగా దూషిస్తే తప్పు అని జగన్ ని కోరారా.
మీకు హక్కుగా రావాల్సిన వేతనాల్లో జగన్ కోత పెట్టాడు.
వీటి పై పోలీసు అధికారుల సంఘానికి బాధ లేదా.
ఎందుకు మాట్లాడరు.డిజిపి, విషాంత్ రెడ్డి, అమ్మిరెడ్టి లు చంద్రబాబు పై పగ తో పని చేస్తున్నారు.
చంద్రబాబు కు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఈ ఆటంకాలు, దాడులు చేయిస్తున్నారు.చంద్రబాబు, లోకేష్ లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులు పై లేదా.
రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకుంది.పోలీసులు ను అడ్డం పెట్టుకుని కుట్ర లు చేస్తున్నారు.
పదవుల కోసం కొంతమంది పోలీసులు వైసిపి నాయకులకు కొమ్ము కాస్తున్నారు.పోలీసు అధికారుల సంఘం కూడా వైసిపి పోలీసు సంఘంగా మారింది.
వరుస పరిణామాల పై చర్చకు మేము సిద్దం.మిమ్మలను అడ్డం పెట్టుకుని మా వాళ్లను పెడుతున్నారు.
పోలీసులు రెండు రోజులు సెలవు పెట్టండి…చంద్రబాబా, జగనా అనేది తేలుతుంది.
ఈ ప్రభుత్వం బిసి వ్యతిరేక ప్రభుత్వం.
వైసిపి పోలీసు అధికారుల సంఘం గా ఉన్న వాళ్లు ఆలోచన చేసుకోండి.జగన్ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు పై మీరు స్పందించరా.
మీ సిఐ ఆత్మహత్య చేసుకుంటే మీ మనసు కరగదా.వైసిపి నాయకులు పోలీసులు ను తిడుతుంటే… మీకు కమ్మగా ఉంటుందా.
మేము తప్పు అని చేబితే మా పై కేసులు పెడతారు.వైసిపి వాళ్లు బూతులు తిట్టినా సలాం చేస్తారు.
పోలీసులు కూడా మీ పని తీరు మార్చుకోండి.చంద్రబాబు ఇంటి మీదకు వచ్చిన జోగి రమేష్ పై కేసు లేదు.
అడ్డుకున్న మా వాళ్ల పై కేసులు పెట్టారు.ఇటువంటి వాటి పై పోలీసు అధికారుల సంఘం ఏం చేసింది.
వాళ్లను అడ్డం పెట్టుకోవడం కాదు జగన్ రెడ్డీ… దమ్ముంటే ధైర్యం గా మా చంద్రబాబు ను ఎదుర్కో.