ఉప్పెన సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుచ్చిబాబు ( Buchibabu ) మొదటి ప్రయత్నం తోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు.సుకుమార్ శిష్యుల్లో బుచ్చిబాబు ది బెస్ట్ అంటూ నిరూపించుకున్నాడు.
గురువు గారి మార్గంలో కాకుండా పూర్తి విభిన్నమైన సినిమాలను చేస్తూ తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు.మరోసారి సూపర్ హిట్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బుచ్చిబాబు తన తదుపరి సినిమాని ఎన్టీఆర్ తో చేయాలని భావించాడు.
కానీ ఆయన బిజీగా ఉండడంతో రామ్ చరణ్( Ram charan ) వద్దకు వెళ్లాడు.చరణ్ కి బుచ్చిబాబు చెప్పిన స్టోరీ లైన్ నచ్చింది.
వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.అంతే కాకుండా ఇటీవల పూర్తి స్క్రిప్టు రెడీ అవ్వడం తో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) వద్దకు బుచ్చిబాబు వెళ్ళాడు.రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ కి మరియు చరణ్ ఇమేజ్ కి బుచ్చిబాబు రెడీ చేసిన స్క్రిప్ట్ తప్పకుండా సెట్ అవుతుందని, ఇద్దరికి కూడా ఈ సినిమా సక్సెస్ ని ఇస్తుందని నమ్మకం ను చిరంజీవి వ్యక్తం చేశారట.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని స్క్రిప్ట్ విన్న తర్వాత చిరంజీవి నమ్మకం వ్యక్తం చేశాడట.

బుచ్చిబాబుతో చరణ్ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని చిరు నమ్మకం వ్యక్తం చేశాడని తెలుస్తోంది.చిరంజీవి నుండి మంచి మార్కులు సొంతం చేసుకున్న బుచ్చిబాబు అతి త్వరలోనే రామ్ చరణ్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా ను చేస్తున్న రామ్ చరణ్ ఆ సినిమా షూటింగ్ ని మరో రెండు నెలల్లోనే పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.ఆ వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తన కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.2025 సంవత్సరంలో రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.అంతకు ముందు కూడా ఈ సినిమా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు.రామ్ చరణ్ ఉప్పెన కాంబినేషన్ కచ్చితంగా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది అనడంలో సందేహం లేదు.