ఇది చాలా చిన్న విషయం... గొడవపై స్పందించిన మంచు విష్ణు!

మంచు ఫ్యామిలీలో(Manchu Family) వివాదాలు జరుగుతున్నాయి అంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వివాదాలు ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య జరిగినప్పటికీ తాజాగా ఒక్కసారిగా వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలు బయటపడ్డాయి.

 It's A Very Small Matter Manchu Vishnu Reacts To The Quarrel , Manchu Vishnu , F-TeluguStop.com

మంచు విష్ణు(Vishnu) మనోజ్ (Manoj)మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ వార్తలకు బలం చేకూరేలా మనోజ్ పెళ్లిలో విష్ణు ఒక అతిథి లాగా వచ్చి వెళ్లిపోయారు.

ఇక మోహన్ బాబు(Mohan Babu) పుట్టినరోజు వేడుకలలో మనోజ్ పాల్గొనడంతో విష్ణు దూరంగా ఉన్నారు.ఇలా ఈ సంఘటనలని అనుమానాలకు బలం చేకూర్చాయి.

Telugu Quarrel, Manchu Vishnu, Manoj, Mohan Babu, Sardhi-Movie

ఇలా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలు బయటపడ్డాయి.మనోజ్ అనుచరులతో విష్ణు గొడవ పడటమే కాకుండా వారిపై చేయి చేసుకోవడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది.ఇందుకు సంబంధించిన వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా తన బంధువుల ఇళ్లకు వచ్చి కొడుతుంటారంటూ వీడియోని షేర్ చేశారు.ఇలా కుటుంబ గొడవలు బజారుకీర్చడంతో మోహన్ బాబు(Mohan Babu) ఈ విషయంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Telugu Quarrel, Manchu Vishnu, Manoj, Mohan Babu, Sardhi-Movie

అయితే మోహన్ బాబు సూచనల మేరుకే మనోజ్ ఈ వీడియోని డిలీట్ చేశారు.అయితే అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ గొడవ గురించి మంచు విష్ణు స్పందించారు.ఇది నిన్న జరిగిన గొడవ మా ఇద్దరి మధ్య తరచూ ఇలాంటి చిన్న చిన్న గొడవలు రావడం సర్వసాధారణం.సారధితో నేను గొడవ పడుతుంటే మనోజ్ ఆపలేదు.

కానీ వీడియో తీస్తూ కూర్చున్నాడు.మనోజ్ చిన్నవాడు ఈ విషయంపై స్పందించాల్సినంత అవసరం లేదు.

మరి ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకండి.మావాడు ఏదో ఆవేశంలో ఈ వీడియోని పోస్ట్ చేశాడు అంటూ విష్ణు ఈ గొడవ గురించి స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube