గత కొంతకాలంగా నటుడు నరేష్(Naresh) నటి పవిత్ర లోకేష్ (Pavitra Lokesh)తో కలిసి రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలకు అనుగుణంగా తరచూ వీరిద్దరూ కలిసి తిరగడం దేవాలయాలకు సందర్శించడం వంటివి జరిగాయి.
ఇకపోతే గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన వీరిద్దరూ ఒక వీడియోని షేర్ చేశారు.ఇక ఈ వీడియోలో వీరిద్దరూ లిప్ లాక్ చేస్తూ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం అంటూ ఈ వీడియోని షేర్ చేశారు.
ఇక ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.ఇక ఈ లిప్ కిస్ వీడియో గురించి మర్చిపోకముందే నరేష్ మరోసారి పవిత్రను పెళ్లి చేసుకున్నటువంటి వీడియోని షేర్ చేశారు.

ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.నరేష్ అనంతపని చేశారు పవిత్ర లోకేష్ ను తాను పెళ్లి చేసుకున్నారు అంటూ ఈ వీడియో పై స్పందించారు.అయితే మరి కొందరు మాత్రం ఇది నిజమైనది కాదని ఏదో సినిమా కోసం ఇలా చేసి ఉంటారని సందేహాలు వ్యక్తం చేశారు.ఈ విషయం గురించి నరేష్ ను ప్రశ్నించగా ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాల గురించి క్లారిటీ ఇస్తానని తెలిపారు.
అయితే తాజాగా నరేష్ పెళ్లి వీడియో గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇలా నరేష్ పవిత్ర ఇద్దరు కూడా నిజంగానే పెళ్లి చేసుకోలేదని వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి(Malli Pelli) అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగానే వీరిద్దరికి పెళ్లి చేసినటువంటి వీడియోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇక ఈ సినిమా వేసవిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది అంటూ ఒక పోస్టర్ , వీడియో, గ్లింప్ విడుదల చేశారు.
ఇక ఈ సినిమాని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయం తెలియడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.







