గత బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం కంటే తాము భిన్నమైన పాలన అందిస్తామనే సంకేతాలు ఇస్తోంది తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్.ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పై ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి తో , సహా విపక్ష నాయకులు అనేక మందిపై కక్ష సాధింపుతో వ్యవహరించిందని, కానీ ఇప్పుడు రేవంత్ ( CM Revanth Reddy )అందరిని కలుపుకు వెళ్లే విధంగా వ్యవహరిస్తున్నారని, విపక్షాల సలహాలను సేకరిస్తామని ప్రకటించడం కూడా దీనికి నిదర్శనం అనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి .తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహరిస్తోంది .ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇస్తూ , ఆ విషయం ప్రజల్లోకి వెళ్లేలా కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది.

ప్రజా పరిపాలనలో ఇది మంచి పరిణామం అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు .ప్రతిపక్ష సభ్యులకు అవకాశం ఇస్తూనే .సమయం వృధా కాకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు పడుతోంది.దీంతో పాటు మధ్య మధ్యలో క్లారిఫికేషన్ సమయం కూడా ఎక్కువ ఇస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది.ప్రభుత్వం కు ప్రతిపక్షాల సలహాలు కూడా అవసరం అని స్వయంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
ఇక స్పీకర్ అన్ని పార్టీలకు నిబంధన ప్రకారం సమయం ఇస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు చెబుతున్నారు .కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కేసీఆర్ ఇవ్వలేదని , ప్రభుత్వ తప్పిదాలు, ప్రజల ఇబ్బందులను వివరించేందుకు ప్రయత్నించినా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని , కొన్ని కొన్ని సార్లు మార్షల్ ను పెట్టి బయటకు పంపించిన చరిత్ర కూడా బీఆర్ఎస్ కు ఉందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.గత సీఎం కేసీఆర్( KCR ) వ్యంగ్యంగా తమపై ఎన్నో విమర్శలు చేశారని, కానీ ఇప్పుడు రేవంత్ దానికంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారని వారు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఎంతగా విమర్శిస్తున్నా, రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరిస్తూ వారికి సమాధానం ఇస్తున్నారని , ఈ విధంగా రేవంత్ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారని, రాజకీయాల్లో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అంటూ ఆ పార్టీ నేతలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.