భువనగిరిలో గులాబీ ఓటు బ్యాంకు కమలం వైపుకు...?

యాదాద్రి భువనగిరి జిల్లా: లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్దుల గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

తెలంగాణను సౌత్ ఇండియాకు గేట్ వే గా భావిస్తున్న బీజేపీ ఇక్కడ అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని అస్త్రశస్త్రాలు సిద్దం చేస్తోంది.

అందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి లోక్ సభ స్థానంపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది.ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి పెద్దగా ప్రభావం చూపక పోవడంతో గులాబీ ఓటు బ్యాంకును కమలం వైపుకు మళ్లించే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నట్లు జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి అర్థమవుతుంది.

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం,అవినీతి ఆరోపణలు తీవ్రంగా వస్తుండడంతో ఇప్పటికే నాయకులు,కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు.దీనిని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది.

గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ ను రంగంలో దింపి, తొలిసారి భువనగిరి ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేయాలని అడుగులు వేస్తుంది.ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్ధి బూర నరసయ్య గౌడ్ 2022 మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ తో విభేదించి బీజేపీలో చేరారు.

Advertisement

ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్నాయి.దీంతో బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకును కొంతమేరకు బీజేపీకి మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని వినికిడి.

అంతేకాకుండా భువనగిరి పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా బీసీ జనాభా ఉండడం,బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ రావడం, బీఆర్ఎస్ బీసీకి టిక్కెట్ ఇచ్చినా అతను అంతంగా ప్రభావం చూపకపోవడం, కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వడం బూర నర్సయ్య గౌడ్ కు కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేస్తుంది.దీనికి తోడు ప్రధాని మోడీ మ్యానియా కూడా పనికొస్తుందని అంచనా వేస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోకపోవడంతో భువనగిరి ఎంపీ స్థానానికి కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

"క" సినిమాతో కిరణ్ అబ్బవరం ఖాతాలో సంచలన రికార్డ్.. రేంజ్ పెరిగిందిగా!
Advertisement

Latest Yadadri Bhuvanagiri News