బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )ను ఈడీ రెండో రోజు కస్టడీకి తీసుకుంది.ఢిల్లీ ఈడీ కార్యాలయంలోని ప్రవర్తన్ భవన్ లో కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam Case ) కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను అధికారులు ప్రశ్నించనున్నారు.లిఖిత పూర్వకంగా మరియు మౌఖికంగా కవితను విచారించనున్నారు.
లిక్కర్ పాలసీ( Liquor Policy ) రూపకల్పనతో పాటు రూ.100 కోట్ల ముడుపులపై ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించనున్నారు.అదేవిధంగా అరుణ్ పిళ్లై, విజయ్ నాయర్, కవితను కలిపి అధికారులు ప్రశ్నించనున్నారు.