జాతీయ స్థాయిలో విపక్ష కూటమిలో బీఆర్ఎస్ పార్టీకి స్థానం ఉండదని కాంగ్రెస్ నేత మధు యాష్కీ తెలిపారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
కుటుంబ పాలన కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి.ప్రజాపాలన కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తు ఉండదని తెలిపారు.ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల వ్యూహా కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాంపై నేతలు చర్చించారని సమాచారం.