కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్టు గిన్నీస్ రికార్డ్ అని చెప్పారన్నారు.
కానీ అది ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలిందని విమర్శించారు.
నాలుగేళ్లలో కాళేశ్వరం నుంచి 172 టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్ట్ చేశారని ఈటల రాజేందర్ తెలిపారు.
లక్ష్మీ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మళ్లీ పరిశీలించాలని చెప్పారు.నీళ్లు, నిధులు, నియామకాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని మండిపడ్డారు.
అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారన్న ఈటల ల్యాండ్ ఫూలింగ్, అభివృద్ధి పేరిట భూములు లాక్కుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.







