హర్రర్ఈ నేపద్యానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.థియేటర్ కి వెళ్లి ఒక రకమైన భయానికి, థ్రిల్ కి గురవ్వడం ప్రేక్షకుడికి కలిగే ఒక మంచి అనుభూతి.
మరి అలాంటి అనుభూతి కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు.అందుకే మేకర్స్ కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు ఎన్ని థ్రిల్లర్స్, హార్రర్స్ తీస్తూనే ఉన్నారు.
అందులో చాల సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి.సినిమాలో ఎదో ఒకటి లేదా రెండు సన్నివేశాలు జనాలకు భయాన్ని పుట్టిస్తాయేమో కానీ ఆధ్యంతం టెన్షన్ పెట్టె ప్రేక్షకుడిని మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమాలు చాల అరుదుగా వస్తూ ఉంటాయి.
మరి దాదాపు కొన్నేళ్ల నుంచి అలాంటి అరుదైన భయానక సినిమాలు రెండే రెండు వచ్చాయి.అవి ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయంత్నం చేద్దాం.
తుంబాడ్

మైథలాజికల్ హారర్ జోనర్ లో తెరకెక్కిన తుంబాడ్ మూవీ( Tumbbad ) 2018 లో హిందీ లో నిర్మాణం జరుపుకుంది.అక్కడ మంచి హిట్ కొట్టక తెలుగు, తమిళ్, స్వీడన్ వంటి భాషల్లో కి డబ్ చేయబడి అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) లో అవెలబుల్ లో ఉంది.ఈ సినిమా చుసిన తర్వాత అందులో నుంచి బయటకు రావడానికి ప్రేక్షకుడికి చాల టైం పడుతుంది.అంతలా మెస్మరైసింగ్ స్టోరీ తో వచ్చిన తుంబాడ్ ఈ సినిమాను ఇద్దరు డైరెక్ట్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది.
13 B

దాదాపు 14 ఏళ్ళ క్రితం మాధవన్( Madhavan ) మెయిన్ లీడ్ గా వచ్చిన మూవీ 13 B. ఈ సినిమా సైతం ప్రేక్షకులను ఆసాంతం టెన్షన్ కి గురి చేసింది.ప్రతి క్షణం చూస్తున్న వారిని భయాందోళనలకు గురి చేసి అప్పుడే సినిమా అయిపోయిందా అని అనిపించింది.ఈ సినిమా వచ్చి ఇన్ని ఏళ్ళు అవుతున్న కూడా జనాలకు ఇంకా ఈ చిత్రం గుర్తుంది అంటే దాని తాలూకా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పటికి ఈ సినిమా టీవీ లో వస్తున్న మళ్లి మళ్లి చూస్తూనే ఉన్నారు.







