మహారాష్ట్రపై బీఆర్ఎస్ ఫోకస్... పది రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభం

మహారాష్ట్రపై బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.ఇందులో భాగంగా నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించారు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తోంది.అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు.

ఈ నేపథ్యంలో రాబోయే పది రోజుల్లోనే బీఆర్ఎస్ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు.మరోవైపు నాందేడ్ వేదికగా కేసీఆర్ మహారాష్ట్ర ప్రజలు హామీలు ఇచ్చారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.అంతేకాకుండా చెరుకు రైతులను ఆకట్టుకునేలా కేసీఆర్ ప్రసంగించారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు