తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) తెలిపారు.ఈ మేరకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని చెప్పారు.పంట నష్టంపై ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి సర్వే చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అధికారుల నుంచి నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు.వచ్చే ఖరీఫ్ నుంచి క్రాప్ ఇన్సూరెన్స్( Crop Insurance ) అమలు చేస్తామన్నారు.
ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్న మంత్రి జూపల్లి రూ.2 లక్షల రుణమాఫీని ఒకేసారి చేయాలని ప్రభుత్వం చూస్తుందని తెలిపారు.ఓటమిని జీర్ణంచుకోలేక బీఆర్ఎస్( BRS ) నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని వెల్లడించారు.







