కడప జిల్లా నాయకులతో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) భేటీ ముగిసింది.రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) తాను కడప( Kadapa ) నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నానని జిల్లా నేతలకు షర్మిల చెప్పారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి ఆదేశాలు రాగానే పోటీ అంశంపై స్పష్టత ఇస్తానని షర్మిల తెలిపారు.
అదేవిధంగా ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఆశావాహుల నుంచి వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.ఈ క్రమంలోనే పార్టీ ఆదేశిస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.అధిష్టానం క్లియరెన్స్ ఇవ్వగానే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.