వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ( BRS party ) తరుపున సిఎం అభ్యర్థి కేటిఆర్ అని.వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే కేసిఆర్ తన తనయుడు కేటిఆర్( K.
T.Rama Rao ) ను సిఎం చేస్తారని ఇందూలో ఎలాంటి సందేహాలు లేవని గత కొన్నాళ్లుగా తెలంగాణలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.చాలా సందర్భాల్లో బిఆర్‌ఎస్ నేతలు కూడా కేటిఆర్ సిఎం అవుతారని చెప్పడంతో బిఆర్‌ఎస్ సిఎం అభ్యర్థి కేటిఆరే అని భావించరంతా.ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా కేటిఆర్ టార్గెట్ గానే విమర్శలు గుప్పిస్తు ఉంటారు.
అయితే బిఆర్‌ఎస్ నుంచి కేటిఆర్ సిఎం అభ్యర్థి అని అటు కేసిఆర్ గాని ఇటు కేటిఆర్ గాని ఎప్పుడు స్పష్టం చేయలేదు అలాగని ఖండించలేదు.

దీంతో పోలిటికల్ సర్కిల్స్ లో వినిపించే ఈ వార్తలలో ఎంతో కొంత నిజం ఉండే అవకాశం ఉందని అందరు భావించారు.దీనికి కారణం కూడా లేకపోలేదు.ఒకప్పటి టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్ గా మార్పు చెందడం, తెలంగాణ ముఖమంత్రి కేసిఆర్ జాతీయ రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేయడంతో దేశంలో కేసిఆర్ రాష్ట్రంలో కేటిఆర్ చూసుకుంటారనే వాదన పెరుగుతూ వచ్చింది.

అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ స్పష్టతనిచ్చారు.వచ్చే ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ తరుపున సిఎం అభ్యర్థి కేసిఆరే అని స్పష్టం చేశారు.దీంతో వైరల్ అవుతున్న వార్తలన్నిటికి చెక్ పడినట్లైంది. అంతే కాకుండా తమ పార్టీ సిఎం అభ్యర్థి కేసిఆర్ అని, ఇతర పార్టీలు కూడా వారి వారి సిఎం అభ్యర్థులను ప్రకటించాలని సవాల్ చేశారు.
అప్పుడే ప్రజలకు ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై ఓ క్లారిటీ వస్తుందని కేటిఆర్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.ప్రస్తుతం కేంద్రంలో మోడి సర్కార్( Narendra Modi ) ను గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న కేసిఆర్.వచ్చే తెలంగాణ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రంపై ఎంతమేర దృష్టి పెడతారనేది ఆసక్తికరమే.

అయితే పేరుకు ముఖ్యమంత్రి పదవి కేసిఆర్ చేపట్టినప్పటికి భాద్యత మొత్తం కేటిఆర్( CM KCR ) చూసుకుంటారనే వాదన కూడా వినిపిస్తోంది.మొత్తానికి బిఆర్‌ఎస్ సిఎం అభ్యర్థి ఎవరో తేలిపోవడంతో మిగిలిన పార్టీల సిఎం అభ్యర్థులు ఎవరనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.







