ఇక బీఆర్ఎస్ దూకుడు ! జిల్లాల బాధ్యతలు వీరికి అప్పగింత ? 

తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్(BRS) ను  అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్(KCR) గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలు అమలు చేస్తూ బిజెపి , కాంగ్రెస్ లపై పై చేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు.

 Brs Aggression Are The Responsibilities Of The Districts Assigned To Them ,brs,-TeluguStop.com

ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ శ్రేణులు అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ విజయానికి కృషి చేసే విధంగా ఆత్మీయ సమ్మేళనాలతో పాటు అనేక కార్యక్రమాలను పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో నిర్వహించే విధంగా కేసీఆర్ ప్లాన్ చేశారు.దీనిలో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పార్టీ జిల్లాల అధ్యక్షులతో పాటు,  ప్రధాన కార్యదర్సులతో ప్రత్యేకంగా రెండు రోజుల క్రితమే టెలికాన్ఫిరెన్స్ నిర్వహించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

Telugu Brs, Congress, Telangana-Politics

అలాగే  నియోజకవర్గాలకు చెందిన వివిధ స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు , జిల్లాల పార్టీ అధ్యక్షులను సమన్వయం చేసుకునే విధంగా కొత్తగా సమన్వయకర్తలను నియమించారు.కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారు పార్టీ తరఫున ప్రత్యేకంగా కార్యక్రమాలను అమలు బాధ్యతలను చూస్తారు.ఈ బృందంలో జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో పాటు సమన్వయ కర్తలు ఉంటారు.వీరు ఆయా కార్యక్రమాల అమలను సమన్వయం చేస్తారు ఈ మేరకు పార్టీ నియమించిన నాయకులు,  తమకు బాధ్యతలు అప్పజెప్పిన జిల్లాల మంత్రులు , స్థానిక ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి,  పార్టీకి సంబంధించిన ప్రణాళికలు, కార్యక్రమాల అమలును చర్చించే విధంగా కేటీఆర్ వారికి తగిన సూచనలు చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ , బిజెపిలపై పై చేయి సాధించే విధంగా ప్రజల్లోకి బీఆర్ఎస్ ను తీసుకువెళ్లే విధంగా జిల్లాల వారీగా బీఆర్ఎస్ సమన్వయకర్త నియామకాన్ని చేపట్టారు.జిల్లాల వారీగా  నియమించబడిన సమన్వయకర్తల వివరాలు ఒకసారి పరిశీలిస్తే.

Telugu Brs, Congress, Telangana-Politics

హైదరాబాద్ – దాసోజు శ్రావణ్, వనపర్తి,  జోగులాంబ గద్వాల – తక్కల్లపల్లి రవీందర్రావు, మేడ్చల్ – పల్లా రాజేశ్వర్ రెడ్డి, కరీంనగర్,  రాజన్న సిరిసిల్ల – బసవరాజు సారయ్య, నల్గొండ – కడియం శ్రీహరి, వికారాబాద్ –  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి – ఎల్ రమణ, భద్రాద్రి కొత్తగూడెం –  టి భాను ప్రసాద్ రావు, సంగారెడ్డి –  వెంకట్రాంరెడ్డి, మెదక్  – ఎగ్గే మల్లేశం , మహబూబ్ నగర్,  నారాయణపేట – కసిరెడ్డి నారాయణరెడ్డి, యాదాద్రి భువనగిరి – యాదవ రెడ్డి, నాగర్ కర్నూల్ – పట్నం మహేందర్ రెడ్డి, భూపాలపల్లి ములుగు భూపాలపల్లి – ములుగు –  అరికెల నర్సారెడ్డి, సిద్దిపేట – బొడి కుంట్ల వెంకటేశ్వర్లు , హనుమకొండ , వరంగల్ – ఎం ఎస్  ప్రభాకర్, నిర్మల్ , ఆదిలాబాద్ – వి గంగాధర్ గౌడ్, మంచిర్యాల, అసిఫాబాద్ – నారదాసు లక్ష్మణ్, జనగామ – కోటిరెడ్డి, మహబూబాబాద్ – పురాణం సతీష్, కామారెడ్డి – దండే విఠల్ , నిజామాబాద్ – బండ ప్రకాష్ , జగిత్యాల – కోలేటి దామోదర్, పెద్దపల్లి – ఎర్రోళ్ల శ్రీనివాస్ , ఖమ్మం సేరి సుభాష్ రెడ్డి, సూర్యాపేట మెట్టు శ్రీనివాస్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube