వీడియో: బ్రిటిష్ అల్లుడిని హార్ట్ టచింగ్‌గా ఆహ్వానించిన ఇండియన్ ఫ్యామిలీ..

నేటి కాలంలో, లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్‌తో సహా వివిధ రూపాల్లో సంబంధాలు చూస్తున్నాం.అయితే, ఈ సంబంధాలలో కుటుంబానికి భాగస్వామిని పరిచయం చేయడం ఒక ముఖ్యమైన దశ, ముఖ్యంగా సాంస్కృతిక భేదాలు ఉన్నప్పుడు ఇది మరింత అవసరం అవుతుంది.

 British Boyfriend Welcomed With Love By Indian Family Video Viral Details, Briti-TeluguStop.com

ఇటీవల, ఒక భారతీయ కుటుంబం( Indian Family ) ఈ సాంస్కృతిక భేదాలను హ్యాపీగా అంగీకరించారు.వారు వారి కుమార్తె ప్రేమించిన బ్రిటిష్ యువకుడిని స్వాగతించే హార్ట్ టచింగ్ వీడియో( Heart Touching Video ) తాజాగా ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.

వీడియో ప్రారంభంలో భారతీయ యువతి, ఆమె బ్రిటిష్ ప్రియుడు( British Boyfriend ) కుటుంబం ఇంటి ముందు నిలబడి ఉండటం చూడవచ్చు.

ఆ తర్వాత జరిగినది ఒక అందమైన సాంస్కృతిక అంగీకారం.బ్రిటిష్ యువకుడు గౌరవప్రదంగా తన ప్రియురాలి తల్లి పాదాలకు నమస్కారం చేస్తాడు.ఆపై ఆమెకు గులాబీల గుత్తిని( Roses ) బహుమతిగా ఇస్తాడు, ఇది ఆప్యాయత, స్వాగతానికి చిహ్నం.

వీడియోలో, తల్లి కూడా ఆప్యాయంగా స్పందిస్తుంది.ఆమె బ్రిటిష్ యువకుడి నుదిటిపై తిలకం పెట్టి ఆశీర్వదిస్తుంది.

ఇతర కుటుంబ సభ్యులు పూల వర్షం కురిపిస్తూ, ఆలింగనాలతో దంపతులను స్వాగతిస్తారు.

@ali_agg అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హార్ట్ టచింగ్ వీడియోను షేర్ చేశారు.దీనికి 70 లక్షలకు పైగా వ్యూస్, లక్షలాది లైక్స్‌ వచ్చాయి.నెటిజన్లు తమ భావోద్వేగాలను హార్ట్ ఎమోజీలు, పాజిటివ్ కామెంట్స్‌తో వ్యక్తం చేశారు.

ఈ వీడియో ప్రేమకు సరిహద్దులు లేవు, సాంస్కృతిక భేదాలను అధిగమించి ఒకరినొకరు అంగీకరించవచ్చనే ఓ ముఖ్యమైన సందేశాన్ని తెలియజేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube