కవితమ్మకు బెయిల్ వస్తుందా రాదా ? నేడు ఏం తేలనుందో ? 

ఢిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) కేసులో అరెస్ట్ అయ్యి జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న బి.ఆర్.

 Will Mlc Kavitha Get Bail Or No What Will Happen Today, Mlc Kavitha, Kalvakunt-TeluguStop.com

ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది.రిమాండ్ లో ఉన్న కవిత తనకు మధ్యంత బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ వేయడంతో నేడు ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాధా అనేది క్లారిటీ రానుంది .ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు.తన కుమారులకు పరీక్షలు ఉన్నాయని, కాబట్టి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ వేశారు .ఢిల్లీ హౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court )లో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది .ఏప్రిల్ 16 వరకు తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ వేశారు.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యంతర బెయిల్ ఇవ్వద్దంటూ అభ్యంతరాలు తెలిపే అవకాశం కనిపిస్తోంది.

Telugu Brs, Congress, Kavitha, Mlc Kavitha, Rouse-Politics

 ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం కీలక దశలో ఉన్న నేపథ్యంలో , సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడి తరఫున వాదించే అవకాశం కనిపిస్తోంది.కవిత బెయిల్ పై బయటకు వెళితే .సాక్షులను ప్రభావితం చేస్తే .విచారణ పైన దాని ప్రభావం ఉంటుందని ఈడీ తరపున న్యాయవాదులు వారించబోతున్నారు.దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాధా అనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ కలుగుతుంది.కవితను మార్చి 15న హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు .ఆ తర్వాత రోజు ఆమెను ఢిల్లీ హౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.

Telugu Brs, Congress, Kavitha, Mlc Kavitha, Rouse-Politics

 ముందుగా విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఈడీ కష్టడికి న్యాయస్థానం అనుమతించింది.సుప్రీంకోర్టు లో బెయిల్ కోసం ఆశ్రయించినా, ట్రయిల్ కోర్టుకు వెళ్లాలని సూచించడంతో,  ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు.ఆమె మధ్యంతర బెయిల్ పై నేడు తీర్పు వెలువడనుండడంతో,  బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కవిత అరెస్టు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube