భారత ఎన్నారైలపై అమెరికా ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు అంతా ఇంతా కావు.ట్రంప్ అధికారం చేపట్టిన నాటినుంచీ నేటి వరకూ కూడా భారతీయ ఎన్నారైలపై తీవ్ర ఆంక్షలు పెడుతూ వీసాలపై కొత్త కొత్త నిభందనలు తీసుకువస్తూ భారతీయులని తమ అమెరికా వదిలి వెళ్ళేలా చేస్తోంది.
అయితే ఈ కోవలోనే బ్రిటన్ ప్రభుత్వం కూడా కొత్త నిభందనలు తీసుకువస్తోంది.
అమెరికా మాదిరిగానే వలసల విధానాన్ని ప్రక్షాళన చేయడానికి భారతీయ ఉద్యోగులని వెనక్కి తిరిగి పంపేలా వ్యూహాలు సిద్దం చేస్తోంది.వీసా పొందిన అభ్యర్ధులు వెనువెంటనే వారి కుటుంబాన్ని సైతం తీసుకోవాల్సి ఉంటుంది.వారిన భావి ఉద్యోగులు సిఫారసుచేసినపక్షంలోమాత్రమే వారి కుటుంబాలను తీసుకునే అనుమతి ఉంటుంది.
అయితే ఐరోపాయేతర పౌరులు, భారతీయ పౌరులకు ఇదే వీసా విధానం అమలవుతుందని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది…బ్రిటన్‌లో నివసిస్తున్న ఐరోపా పౌరులతోపాటు అత్యధిక నైపుణ్యం ఉన్న వృత్తినిపుణులకు ప్రాధాన్యత లభిస్తుంది.కొత్త వ్యవస్థలో మరిన్ని ఆంక్షలు కూడా రానున్నట్లు బ్రిటన్ తేల్చి చెప్పింది అయితే ముందుముందు చర్యలు ఉంటాయా లేక ఈ నిర్ణయంపై వెనకడుగు వేస్తారా అనేది తేలాల్సి ఉంది.