ఇది విన్నారా ..? భగవద్గీత పోటీల్లో ముస్లిం బాలుడికి ప్రథమ బహుమతి

ఏదైనా నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉండాలి కానీ దానికి మతం .కులం అనేవి అడ్డురావని నిరూపించాడు ఓ ముస్లిం బాలుడు.

ఇతడి ప్రతిభకు ఇప్పడు అంతా ఫిదా అయిపోతున్నారు.వివరాల్లోకి వెళితే.

బెంగళూరు నగరంలోని సంజయ్‌నగర్ ప్రాంతంలో ఇస్కాన్ భగవద్గీత పోటీలు నిర్వహించింది.భగవద్గీత పోటీల్లో సుభాష్ మెమోరియల్ ఇంగ్లీషు స్కూలుకు చెందిన 9వతరగతి విద్యార్థి షేక్ మొహియుద్దీన్ కు ప్రథమ బహుమతి లభించింది.

సుమారు 14 పాఠశాలలకు చెందిన 400 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో 41 ప్రశ్నలు అడిగారు.బాలాజీ లేఅవుట్ కు చెందిన సలాయుద్దీన్ కుమారుడైన షేక్ మొహియుద్దీన్ అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి అందరి నుంచి అభినందనలు అందుకున్నారు.తమ అమ్మమ్మ భగవద్గీత కొని ఇవ్వడంతో ఆరునెలల్లో పూర్తిగా చదివానని మొహియుద్దీన్ చెప్పారు.

Advertisement

తాను గతంలోనే ఖురాన్ చదివానని, భగవద్గీత చదివాక మానవ విలువలు అన్నింట్లోనూ ఒకటేనని గ్రహించానని చెప్పాడు.ప్రస్థుతం బైబిల్ కూడా చదువుతున్నానని షేక్ చెబుతున్నాడు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు