మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వాంగ్మూలాన్ని ఢిల్లీ పోలీసులు రికార్డ్ చేశారు.బ్రిజ్ భూషణ్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు కొన్ని పత్రాల కోసం ప్రశ్నించారని తెలుస్తోంది.
మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు.తన వివరణలో కొన్ని వీడియో ఆధారాలతో పాటు మొబైల్ డేటాను కూడా సేకరించాలని ఆయన పోలీసులను కోరారు.
ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ ను సిట్ అధికారులు మరోసారి విచారిస్తారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ క్రమంలోనే వినోద్ తోమర్ స్టేట్ మెంట్ ను కూడా పోలీసులు నమోదు చేశారు.
కాగా వేధింపుల కేసులో వినోద్ తోమర్ నిందితుడిగా ఉన్నారు.