పసుపు సాగును ఆకుమచ్చ, దుంప కుళ్ళు తెగుల నుండి నివారించే పద్ధతులు..!

భారతదేశంలో పసుపు సాగు ( Cultivation of turmeric )అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.పసుపు కు ఏడాది పొడవునా మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు పసుపు పంట సాగు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

 Methods To Prevent Turmeric Cultivation From Leaf Spot And Tuber Rot , Cultivat-TeluguStop.com

కానీ సాగులో పాటించాల్సిన సస్యరక్షక పద్ధతులు తెలియక తీవ్ర నష్టాలను పొందుతున్నారు.పసుపు సాగులో క్రమం తప్పకుండా సస్యరక్షక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి పొంది అధిక మొత్తంలో లాభాలను అర్జించవచ్చు.

ముఖ్యంగా పసుపు పంటకు చీడపీడల బెడద చాలా ఎక్కువ.ఈ చీడపీడలను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టి పంటను సంరక్షించుకోవాలి.

పసుపు పంటను ఆశించే తెగులు ఏమిటో.? వాటిని ఎలా గుర్తించి నివారించాలో తెలుసుకుందాం.

Telugu Agriculture, Turmeric, Latest Telugu, Leaf Spot, Fertilizers-Latest News

ఆకుమచ్చ తెగులు:( Leaf spot ) పలు ప్రాంతాల్లో ఈ తెగులను తాటాకు తెగులు అని కూడా పిలుస్తారు.ఈ తెగులు ఎటువంటి సందర్భాల్లో పంటను ఆశిస్తాయి అంటే గాలిలో తేమశాతం అధికంగా ఉండి సూర్యరశ్మి( sunshine ) తక్కువగా ప్రసరించినప్పుడు, వర్షాలు ఏకధాటిగా కురుస్తూ ఈదురు గాలులు అధికం అయినప్పుడు ఆకు మచ్చ తెగులు పంటను ఆశిస్తాయి.మొక్క ఆకులపై ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడితే వాటిని ఆకుమచ్చ తెగులుగా నిర్ధారించుకోవాలి.తెగులు సోకిన మొక్కను వెంటనే పీకి నాశనం చేయాలి.ఒక లీటరు నీటిలో టేబుకోనజోల్ 50%+ట్రీఫ్లోక్షీస్ట్రోబీన్ 25%WG 2గ్రా ను కలిపి పిచికారి చేయాలి.

Telugu Agriculture, Turmeric, Latest Telugu, Leaf Spot, Fertilizers-Latest News

దుంప కుళ్ళు తెగులు:( tuber rot ) ఈ తెగులు సోగితే పసుపు పంట దిగుబడి చాలావరకు తగ్గుతుంది.ఈ తెగులు సోకడానికి ప్రధాన కారణం పంట చేనులో మురికి నీరు లేదా నీరు నిలువ ఉంటే ఈ తెగులు వ్యాప్తి చెందుతాయి.వర్షాలు కురుస్తున్న సమయంలో నీటిలో అధిక తేమశాతం ఉంటే ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది.

ఈ తెగులు రాకుండా ముందుగా పసుపు విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవాలి.క్రమం తప్పకుండా పోషక ఎరువులు( Nutrient Fertilizers ) పంటకు అందించాలి.ఒక లీటర్ నీటిలో రెండు గ్రాముల రిడోమిల్ కలిపి పంటకు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube