తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందం, నటన మరియు డ్యాన్స్ ఈ మూడు వచ్చిన హీరోయిన్స్ దొరకడం చాలా కష్టం.అధిక శాతం మంది హీరోయిన్లు కేవలం అందాల ఆరబోతకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.
అలాంటి హీరోయిన్స్ ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో కొనసాగడం కష్టం, 30 ఏళ్ళు దాటగానే వాళ్ళను మర్చిపోతారు మేకర్స్, ఎప్పటికైనా నటన ఉంటేనే ఇండస్ట్రీ లో నెగ్గుకురాగలరు.హీరోయిన్ కెరీర్ లైఫ్ స్పాన్ అందుకే తక్కువ ఉంటుంది అని అంటుంటారు విశ్లేషకులు.
కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం మన చిన్న తనం నుండి నేటివరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు, బలమైన పాత్రలు పోషిస్తునే ఉన్నారు.అలాంటి హీరోయిన్స్ లో ఒకరు శ్రీయా శరన్.
( Shriya Saran )
‘ఇష్టం’ అనే చిత్రం తో ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె తెలుగు , హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో అందరి స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇప్పటికీ కూడా ఆమె ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ, హీరోయిన్ గా నటిస్తూ మద్యమద్యలో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కూడా చేస్తూ కెరీర్ లో బిజీ గా గడిపేస్తుంది.
గత ఏడాది ఈమె దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం లో రామ్ చరణ్ కి తల్లి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఆమె తో పాటు హీరోయిన్స్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతోమంది ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు లేక కెరీర్ ని ముగించేశారు.

కానీ శ్రీయ మాత్రం ఇప్పటికీ క్రేజీ మూవీస్ తో ముందుకు దూసుకుపోతుంది.ఇది ఇలా ఉండగా శ్రీయ శరన్ ఆండ్రెయ్ కొత్సవ్( Andrei Koscheev ) అనే ఫారిన్ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే, ఈ దంపతులిద్దరికీ ఒక పాప కూడా ఉంది.సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే శ్రీయా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో భర్త తో కలిసి ఉన్న ఫోటోలు మరియు వీడియోలను అప్డేట్ చేస్తూ ఉంటుంది, వాటికి లక్షల సంఖ్యలో వ్యూస్ మరియు లైక్స్ వస్తుంటాయి.చూడముచ్చటగా ఉండే ఈ జంట పెళ్ళైన కొత్తల్లో సోషల్ మీడియా లో ఒక రూమర్ ప్రచారమైంది.

అదేమిటంటే శ్రీయ కి తన భర్తకి మధ్య గొడవలు జరుగుతున్నాయని , త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు ( Divorce ) తీసుకోబోతున్నారని ఇలా ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి.ఇదే విషయాన్నీ రీసెంట్ గా శ్రీయా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ప్రస్తావించగా దానికి సమాధానం చెప్తూ ‘నేను గతం లో గమనం అనే సినిమా చేశాను, ఆ మూవీ ప్రొమోషన్స్ కి వచ్చినప్పుడు , నా భర్త గురించి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు, సినిమా గురించి కదా ఇంటర్వ్యూ, దాని గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి, మిగతా వాటి గురించి వద్దు అన్నాను,అప్పటి నుండి ఈ రూమర్స్ సోషల్ మీడియా లో ప్రచారం చేసారు’ అని చెప్పుకొచ్చింది శ్రీయా.ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.







