పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతూ దుర్మరణం.మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.
ఆ ఇంట్లో పెళ్లి పండగ వాతావరణం మొదలయ్యింది.చుట్టాలు.
బంధువులతో ఆ ఇల్లంతా పెళ్లి పండగ వాతావరణం మొదలయ్యింది.ఇంతలోనే ఆ ఇంట విషాద వాతావరణం నెలకొంది.
మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.వివరాల్లోకి వెళితే.
అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకలవాండ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎర్రదొడ్డికి చెందిన మహేష్(26) మృతి చెందాడు.ఈ నెల 27న కదిరిలో మహేష్ వివాహం జరగాల్సి ఉంది.
పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో బంధువులకు వివాహ పత్రికను పెంచేందుకు స్వగ్రామం నుంచి అర్ధరాత్రి బయలుదేరిన మహేష్ కొద్ది సమయానికే గుర్తుతెలియని వాహనం ఢీకోని మృత్యువాత పడ్డారు.ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన మహేష్ నెల రోజులు ముందే పెళ్లి కోసం సొంత ఊరు వచ్చాడు.త్వరలో ఓ ఇంటివాడు వై కోడలితో కలిసి జంటగా వస్తావు అకొనుక్కుంటే అందరిని వదిలేసి వెళ్తావా అంటూ తల్లిదండ్రులు బంధువుల రోదనతో కంటతడి పెట్టించింది.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.మృతదేహాన్ని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.