అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం:వియ్యాల వారికి కళ్ళు చెదిరేలా టన్నుల కొద్దీ సారే పంపిన పెళ్ళి కుమార్తె తండ్రి.నోరూరించే వెరైటీలతో కొత్త అల్లుడి కి సారే పంపి అందరిని ఔరా అనిపించిన కోనసీమ అమలాపురం నకు చెందిన దెందుకూరి సత్తిబాబు రాజు.
మూడు టన్నుల స్వీట్స్ తో పెళ్ళి కొడుకుకు సారే పంపిన పెళ్ళి కుమార్తె తండ్రి.రాజుల ఇంట పెళ్ళంటే వైభోగమన్న చందాన అంగరంగ వైభవంగా కుమార్తె పెళ్లి చేసిన సత్తిబాబు రాజు.
కుమార్తె దెందుకూరి సాహితీ ని భీమవరం నకు చెందిన కనుమూరి గౌతమ్ వర్మ కు ఇచ్చి పెళ్లిచేసిన సత్తిబాబు రాజు.పచ్చని కొబ్బరి తోటల్లో ఆకాశమంత పందిరి వేసి బాహుబలి లో మాహిస్మతి కోటల సెట్టింగులు వేసి కుమార్తె వివాహం.
పెళ్లే ఘనంగా చేశారు అనుకుంటే అంతకు మించి అత్తారింటికి వెళుతున్న కూతురి కోసం రెండు వేల ఏడు వందల కేజీల స్వీట్స్ సుమారుగా మూడు టన్నుల సారే పంపిన తండ్రి సత్తిబాబు రాజు.

కోనసీమలో హాట్ టాపిక్ గా మారిన సత్తిబాబు రాజు గారింట పెళ్లి, పంపిన సారే.సాధారణంగా అంత పెద్ద మొత్తం స్వీట్స్ ఎవరైనా బయట స్వీట్స్ షాప్స్ లొనే ఆర్డర్ ఇస్తారు.కానీ ఈ రాజుగారు మాత్రం అన్ని రకాల స్వీట్స్ ను ఇంటివద్దే ఎక్కడ కూడా తగ్గేదెలే అన్నట్టుగా స్వయంగా కుటుంబ సభ్యులంతా కలిసి తయారు చేయటం విశేషం.
పెళ్లికి వారం రోజుల ముందు నుండే స్వీట్స్ తయారి మొదలు పెట్టిన కుటుంబ సభ్యులు.కోనసీమ ఫేమస్ పాలకోవ, తొక్కుడు లడ్డు, లడ్డు, గోరుమిటీలు, పుతరేకులు వంటి స్వీట్స్ తో రాజుగారి ఇల్లంతా నిండిపోయింది.
వీటన్నింటినీ అందరికి పంచేందుకు ఒక స్టీల్ బాక్స్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.మర్యాదలకు పుట్టినిల్లయిన కోనసీమ గురించి ఈ సారే పుణ్యమా అని పక్క జిల్లాల వాసులంతా గుసగుసలాడుకుంటున్నారు.