పెళ్లి.పెళ్లంటే నూరేళ్ల పంట అని చాలా మంది చెబుతారు.
అలా కాకుండా పెళ్లి వల్ల చాలా సమస్యలు వస్తాయని కూడా కొంత మంది చెబుతారు.ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పకుండా పెళ్లి చేసుకుంటారు.
ఈ పెళ్లి కోసం కొంత మంది తమ స్థోమతకు మించి అప్పులు చేస్తారు.కొంత మంది మాత్రం తమకు ఉన్నంతలో సింపుల్ గా చేసుకుంటారు.
ప్రస్తుత రోజుల్లో పెళ్లంటే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇక పెళ్లికి ముందు దిగే ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.ఒక్కోసారి ఈ వెడ్డింగ్ షూట్లు శ్రుతి మించిపోతున్నాయి.వీటి వల్ల మన సాంప్రదాయం దెబ్బతింటోందని ఆరోపించే వారు కూడా ఉన్నారు.అయినా కానీ వీటి హవా మాత్రం తగ్గడం లేదు.చాలా మంది వధూవరులు తమ పెళ్లిళ్లలో వీటిని ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుత రోజుల్లో మరో విషయం కూడా బాగా పాపులర్ అయిపోయింది.ఎవరైనా సరే తమ పెళ్లిలో తామే వైరల్ డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.ఈ సాంప్రదాయం ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది.

ఇలా పెళ్లి కూతుళ్లు చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్నాయి.వారు చాలా ఫేమస్ అయిపోతున్నారు.కాబట్టే చాలా మంది పెళ్లికూతుళ్లు ఇలా డ్యాన్స్ ట్రై చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఓ జంట చేసిన డ్యాన్స్ తెగ చక్కర్లు కొడుతోంది.ఓ మాస్ పాటకు హీరో, హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ జంట వేసిన స్టెప్పులు చేస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే.అలా ఆ జంట స్టెప్పులు ఉన్నాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ జంట వైరల్ స్టెప్పులను వెంటనే చూసేయండి.వారి డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి.







