కొన్ని కొన్ని సార్లు జోక్ చేస్తూ ఉంటారు చాలా మంది.ఏమీ తినకపోతే గాలి భోజనం చేసి బతుకుతావా అంటూ నోటి లో నుంచి ఎప్పుడూ వస్తూ ఉంటుంది.
అయితే నిజంగా గాలి భోజనము చేసి బతుకుతామా ఏంటి.కానీ నిజంగా అమెరికా లోని మిన్నెయాపోలీస్ కు చెందిన 30 ఏళ్ల అదురా అనే మహిళ గాలి తినే బతుకుతుందట.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ఆమె శరీర సౌష్టవం కోసం పలు రకాల ఆహార పదార్ధాలను ప్రయత్నించి విసిగిపోయి చివరికి ఒక మహానుభావుడి ద్వారా ఈ విధంగా గాలి పీలుస్తూ కూడా బతకొచ్చు అని తెలుసుకుందట.
ఇక ఆమె అప్పటినుంచి గాలి తింటూ బతుకుతుంది.అయితే ఈమె డైట్ గురించి తెలుసుకున్న వైద్య నిపుణులు మాత్రం ఉత్త గాలి భోజనం చేస్తే సమస్యలు తప్పవు కావున కనీసం ఘాన పదార్ధాలు కాకపోయినా ద్రవ పదార్ధాలు అయినా తీసుకోవాలని సూచించారట.

దానితో ఇప్పుడు గాలి తో పాటు ఈ అమ్మడు ఫ్రూట్ జ్యుస్ కూడా తీసుకొని తన డైట్ ఫాలో అవుతుంది.అయితే ప్రస్తుతం తానూ చాలా హ్యాపీ గా ఉన్నానని, ఆలా అని అందరూ తన లాగా ఇలాంటి డైట్ ఫాలో అవ్వాలని నేను సూచించలేను అని ఆదరా చెబుతుంది.నిజంగా ఒక్కపూట భోజనం లేకపోయినా నీరసం తో కనీసం అడుగు కూడా వేయలేం.మరి అలాంటిది ఆదరా మాత్రం ఎలాంటి ఘన పదార్ధాలు తీసుకోకుండా కేవలం గాలి,ద్రవ పదార్ధాలతో 97 రోజుల నుంచిజీవితం గడుపుతుంది.







