టాలీవుడ్ మాస్ మహా రాజా రవితేజ సరికొత్త లుక్ తో ఊహించని విధంగా దర్శనమిచ్చాడు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు.
గత కొంత కాలంగా సక్సెస్ ట్రాక్ ను మిస్సవుతున్న ఈ హీరోకి లుక్ పరంగా కూడా నెగిటివ్ కామెంట్స్ అందాయి.

అయితే ఇప్పుడు రవితేజ పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది.చాలా రోజులుగా సైలెంట్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న రవితేజ ఫిట్ నెస్ లో పెద్ద మార్పులే తెచ్చాడు.బక్కచిక్కినట్లు కనిపించి గతంలో విమర్శలు అందుకున్న ఈ కష్టజీవి ఫైనల్ గా కష్టపడి బాడీ పెంచాడు.
ప్రస్తుతం విఐ.ఆనంద్ డైరెక్షన్ లో రవితేజ డిస్కో రాజా అనే సినిమా చేసున్నాడు.

అలాగే మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు.గత ఏడాది టచ్ చేసి చూడు – నేల టిక్కెట్టు – అమర్ అక్బర్ ఆంటోని సినిమాలతో రవితేజ హ్యాట్రిక్ డిజాస్టర్స్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు డిస్కో రాజకోసం సరికొత్త అవతారం ఎత్తిన మాస్ రాజా ఏంతవరకు మెప్పిస్తాడో చూడాలి.
.






