హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.ఐపీఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లోని ఏడు కంప్యూటర్లు మాయమైయ్యాయి.
రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు.కాగా సీసీ టీవీ ఫుటేజీలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయినట్లు గుర్తించారు.
అయితే ఈ దొంగతనం ఇంటిదొంగ పనిగానే తెలుస్తోంది.అకాడమీ ఐటీ సెక్షన్ ఉద్యోగి చంద్రశేఖరే కంప్యూటర్లను దొంగతనం చేసినట్లు నిర్ధారించారు.
అనంతరం ఇంటి దొంగపై రాజేంద్రనగర్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.అయితే కంప్యూటర్ లో ఉన్న డేటా కోసం చోరీకి పాల్పడ్డారా.? లేదా ఇంకేమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







