యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం( Salaar ) రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి సూపర్ హిట్ వస్తే ఎలాంటి వసూళ్లు వస్తాయో, అలాంటి వసూళ్లు ఈ సినిమాకి వస్తున్నాయి.
కేవలం మూడు రోజుల్లోనే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, అలాగే 180 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని ఈ చిత్రం రాబట్టింది.కానీ ఇది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఏమాత్రం సరిపోదట.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 800 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాలి అట.ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే సాధ్యం కాదని అంటున్నారు.

ఎందుకంటే రేపటి అడ్వాన్స్ బుకింగ్స్( Advance Bookings ) ఒక్కసారి పరిశీలిస్తే దాదాపుగా అన్నీ ప్రాంతాలలో సినిమా దారుణంగా డ్రాప్ అయ్యినట్టు అర్థం అవుతుంది.ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ వసూళ్ల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.కేజీఎఫ్ చిత్ర దర్శకుడు మరియు బాహుబలి సిరీస్ హీరో అనగానే హిందీ బయ్యర్స్( Hindi Buyers ) ఈ చిత్రాన్ని కళ్ళు మూసుకొని కొనేశారు.కానీ మొదటి రోజు ఓపెనింగ్స్( Openings ) నుండే ఈ చిత్రం ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేక డీలా పడింది.
ఇక్కడ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టాలి.కానీ ఇప్పటి వరకు ఈ సినిమా 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కూడా రాలేదు.
ఫుల్ రన్ లో 60 కోట్ల రూపాయిలు రావొచ్చని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.అంటే దాదాపుగా 140 కోట్ల రూపాయిల నష్టం అన్నమాట.పాజిటివ్ టాక్ వచ్చిన ఒక సినిమాకి ఈ రేంజ్ నష్టం ఇప్పటి వరకు రాలేదు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో కూడా ఇదే పరిస్థితి.రేపు లేబర్ హాలిడే కాబట్టి, రేపు మ్యాట్నీ షోస్ నుండి పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.తెలంగాణ లో( Telangana ) ఇంకో మూడు రోజులు బలంగా ఆడితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ( Andhra Pradesh ) మాత్రం బ్రేక్ ఈవెన్ దక్కడం చాలా కష్టమని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇక కర్ణాటక , తమిళ నాడు మరియు కేరళ వంటి ప్రాంతాల్లో అయితే భారీ నుండి అతి భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మొత్తం మీద సలార్ క్లోసింగ్ కలెక్షన్స్ 500 కోట్ల రూపాయిల కంటే తక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి, మధ్యలో ఏదైనా మ్యాజిక్ జరిగి లాంగ్ రన్ వస్తుందో లేదో చూడాలి.