పాముని ఎలా పట్టుకోవాలో ఎక్స్‌ప్లెయిన్‌ చేసిన మహిళ.. వీడియో చూస్తే..

సాధారణంగా పామును( Snake ) చూడగానే చాలామంది హాడలిపోతారు.అదే ఆరడుగుల పాము కనిపిస్తే షాక్ అవ్వక తప్పదు.

అయితే ఒక మహిళ( Woman ) ఈ పామును ఏదో ఒక పొట్లకాయ లాగా తీసి ఒక సంచిలో వేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అయ్యింది.

ఇందులో ఆఫీస్‌లోకి వచ్చిన ఓ పామును ఆమె రక్షించినట్లు కనిపించింది.పాము రావడంతో ఆఫీస్‌లోని ప్రజలందరూ టెన్షన్‌గా ఫీల్ అవ్వగా, ఆ మహిళ మాత్రం పామును చాలా ఈజీగా పట్టుకోగలిగింది.

అంతే కాకుండా 6 అడుగుల పొడవున్న స్నేక్‌ను ఎలా పట్టుకోవాలో చాలా ప్రశాంతంగా వివరించింది.

Advertisement

ఆ మహిళ టేబుల్‌పై ఉన్న డెస్క్‌టాప్‌ను సమీపిస్తున్నట్లు వీడియోలో కనిపించింది.ఆమె ఆఫీసు డ్రెస్ ధరించి ఉంది.మొదట్లో కంప్యూటర్ వెనుక ఏదో వెతుకుతున్నట్లు అనిపిస్తుంది.

పాము చాలాసార్లు కాటు వేయడానికి ప్రయత్నించిందని మేల్ కోలీగ్స్ ఆమెను హెచ్చరించారు.అయినా మహిళ భయపడకుండా ప్రశాంతంగా కంప్యూటర్ వెనుకకు చేరుకుని పామును పట్టుకుంది.

దాదాపు 6 అడుగుల పొడవున్న పామును( Six Feet Snake ) చూసి అందరూ షాకయ్యారు, ఆ మహిళ శాంతంగా దాన్ని గోనె సంచిలో వేసుకుంది.ఇది ఇండియన్ రాటిల్ స్నేక్ అని, విషపూరితం కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతుంది.ఆ మహిళ ఎవరో తెలియ రాలేదు కానీ ఆమె ధైర్యానికి చాలామంది ఫిదా అయిపోతున్నారు.

ఈ వైరల్ వీడియోను invincible_ajita యూజర్ పోస్ట్ చేసారు.ఇది నెటిజన్లను ఆకట్టుకుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో తరుణ్ ఎంత వరకు సక్సెస్ అవుతాడు..?
మేడ్చల్ జిల్లాలో షాకింగ్ యాక్సిడెంట్.. వీడియో వైరల్..

"ఆమె ఒక ధైర్యవంతురాలు! ఆమె పామును చాలా క్యాజువల్ గా పట్టేసుకుంది అదేదో పొట్లకాయ అన్నట్లు" అని ఒక వినియోగదారు పేర్కొన్నాడు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు