కెనడాకు( Canada ) వచ్చే అంతర్జాతీయ విద్యార్ధుల సంఖ్యపై పరిమితి విధించాలని పిలుపునివ్వడంతో పాటు విద్యార్ధి వీసాలో( Student Visa ) మార్పులను సూచిస్తూ సిటీ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిందని బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్( Brampton Mayor Patrick Brown ) తెలిపారు.వసతి చిరునామాను చేర్చేలా స్టడీ వీసాలు వుండాలని ఆ తీర్మానంలో ప్రభుత్వాన్ని కోరారు.
హౌసింగ్ సంక్షోభం( Housing Crisis ) తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకోబడింది.ఇది భరించలేని అద్దెలకు దారి తీయడంతో పాటు విద్యార్ధులను వారిలో చాలా మందిని దేశంలోని అసురక్షిత, చట్టవిరుద్ధమైన పరిస్ధితుల్లో నివసించేలా చేస్తుందని పేర్కొన్నారు.

మూడవ ప్రపంచ పరిస్ధితులలో నివసిస్తున్న అంతర్జాతీయ విద్యార్ధులను తాము కలిగి వుండలేమని బ్రౌన్ శనివారం ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్టు చేశారు.బ్రాంప్టన్ సిటీ కౌన్సిల్( Brampton City Council ) ఆమోదాల ప్రక్రియలో భాగంగా స్థానిక చట్టాలకు అనుగుణంగా గృహ చిరునామాను చేర్చేలా అంతర్జాతీయ విద్యార్ధి వీసాలు( International Students Visa ) కోరుతూ ఫెడరల్ ప్రభుత్వానికి పిలుపునిస్తూ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించిందని బ్రౌన్ వెల్లడించారు.మేయర్ చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుత వ్యవస్థ అంతర్జాతీయ విద్యార్ధులను మామూలుగా ఉపయోగించుకోవడానికి అనుమతించడంతో పాటు గృహ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.వీసా ఆమోద ప్రక్రియలో భాగంగా హౌసింగ్ అడ్రస్ అవసరమైతే ప్రతి కాలేజీకి తగిన హౌసింగ్ ప్లాన్ వుంటుందని బ్రౌన్ తెలిపారు.

అధికారిక గణాంకాల ప్రకారం.కెనడాలో అంతర్జాతీయ విద్యార్ధుల సంఖ్య మిలియన్ మార్క్ దాటింది.ఈ క్రమంలోనే ట్రూడో ప్రభుత్వం వారి రాకను పరిమితం చేస్తోంది.2022లో కెనడాలో 8,00,000కు పైగా అంతర్జాతీయ విద్యార్ధులు వుండగా 2023లో ఈ సంఖ్య 9,00,000కు పైగా వుండొచ్చని ఫెడరల్ ప్రభుత్వం అంచనా వేసింది.హౌసింగ్ సంక్షోభం , వలసదారులు, అంతర్జాతీయ విద్యార్ధుల పెరుగుదల నేపథ్యంలో విదేశీ విద్యార్ధుల ఎంట్రీకి అనుగుణంగా ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధను పరిష్కరించాల్సిన అవసరం వుందని బ్రౌన్ పేర్కొన్నారు.