అయోధ్య రామమందిరం( Ayodhya Ram Mandir ) కోసం దేశమంతా ఎదురు చూసిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్( UP CM Yogi Adithyanath ) అన్నారు.రామాలయాన్ని ఎక్కడ నిర్మించాలనుకున్నామో బాలరాముడిని అక్కడే ప్రతిష్టించామని తెలిపారు.

తులసీదాస్ వర్ణించినట్లుగానే బాలరాముడిని ప్రతిష్టించామని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.సుమారు ఐదు వందల ఏళ్ల నాటి భారతీయుల కలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) నెరవేర్చారని తెలిపారు.ఈ క్రమంలోనే రామనగరికి స్వాగతం పలుకుతున్నామన్నారు.అయోధ్య సనాతన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు.ఈ రామ మందిరం దేశ ప్రతిష్టను మరింతగా పెంచుతుందని తెలిపారు.అయోధ్యలో అందరూ నిశ్చితంగా ఉండొచ్చన్న యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో కర్ఫ్యూ ఉండదని తెలిపారు.







