తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ( Director Krishna Vamsi )… ఈయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో బ్రహ్మాజీ రూమ్ లో ఉండేవాడు.
తనకు ఆ సమయంలో జాబ్ చేసి మరి కృష్ణ వంశీ ని పోషించాడు.

దానివల్లే కృష్ణవంశీ డైరెక్టర్ అయిన తర్వాత బ్రహ్మాజీ( Brahmaji ) ని హీరో చేస్తానని మాట ఇచ్చాడు.ఇక దాని ప్రకారమే సింధూరం(Sinduram ) అనే సినిమాలో బ్రహ్మాజీని మెయిన్ హీరోగా పెట్టి ఆ విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.బ్రహ్మాజీ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఆయనకి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అయితే రాలేదు.
ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం బ్రహ్మాజీ చాలా బిజీగా కొనసాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే కృష్ణవంశీ బ్రహ్మాజీని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించాలని ఉద్దేశ్యం తో మురారి సినిమా( Murari )లో రఘుబాబు పోషించిన హీరోయిన్ అన్న పాత్రలో నటించమని చెప్పాడు.
కానీ బ్రహ్మాజీ ఆ పాత్రను రిజెక్ట్ చేశాడు.దాంతో ఆ పాత్రలోకి రఘుబాబును తీసుకొని కృష్ణవంశీ ఆ సినిమా చేశాడు.ఇక మొత్తానికైతే ఆ బ్రాహ్మజీ కృష్ణవంశీ చెప్పిన ఆ పాత్రలో నటించలేదు.

ప్రస్తుతం బ్రహ్మాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character Artist ) గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును పొందుతున్నాడు.స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు.ఇక మొత్తానికైతే బ్రహ్మాజీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్నాడు…అందుకే చాలా మంది డైరెక్టర్లు ప్రతి సినిమాలో ఆయనకి ఒక మంచి క్యారెక్టర్ ఇస్తు ఉంటారు…
.