బోయపాటి డైరక్షన్లో పవన్ కళ్యాన్..?

హీరో ఎవరైనా సరే తన డైరక్షన్లో సినిమా అంటే బాక్సు బద్దలవ్వాల్సిందే.

ఇది బోయపాటి శ్రీను ఫార్ములా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న బోయపాటి దర్శకుడిగా తనకంటూ ఓ సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.

రీసెంట్ గా వచ్చిన సరైనోడుతో బన్నిలోని మాస్ యాంగిల్ చూపించి వారెవా అనిపించేలా చేశాడు.ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న బోయపాటి శ్రీను తన తర్వాత సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో చేయబోతున్నాడట.

ఇప్పటికే డాలి డైరక్షన్లో కాటమరాయుడా సినిమా చేస్తున్న పవర్ స్టార్ ఆ తర్వాత త్రివిక్రం దర్శకత్వంలో ఓ సినిమా కమీట్ అయ్యాడు.అయితే దాసరి నిర్మాణంలో ఎప్పుడో మూవీ కమిట్ అయిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా లైన్లో పెట్టాడట.

ఇక రీసెంట్ గా పుట్టినరోజు జరుపుకున్న పవన్ కు బర్త్ డే విశెష్ తో పాటుగా తారకప్రభు ఫిలంస్ లో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు దాసరి నారాయణరావు.అంతేకాదు ఈ సినిమా డైరక్టర్ గా బోయపాటిని తీసుకోనున్నారట.

Advertisement

మరి పవన్, బోయపాటి కాంబినేషన్ నిజమే అయితే ఇదో క్రేజీ ప్రాజెక్ట్ తప్పక అవుతుంది.సో మరి ఈ కాంబినేషన్ వర్క్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రభాస్ పెళ్లి గురించి షాకింగ్ నిజాలు బయట పెట్టిన గోపి చంద్
Advertisement

తాజా వార్తలు