నిద్రిస్తూ మంచంపై నుండి పడ్డాడు.. ప్రాణాలు పోయాయి.. ఎందుకో తెలుసా?

చావు ఇలా కూడా వస్తుందా? అనే అనుమానం కలుగుతుంది ఈ చావును చూస్తుంటే.అతని చావు అంతా ఘోరంగా లేదు.

కానీ అందరిని షాక్ కి గురి చేసింది.ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.

మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఫ్రెండ్ పుట్టిన రోజు వేడుకలో పీకల్లోతు మద్యం తాగాడు.ఆ తర్వాత ఆ యువకుడు మంచంపై పడుకున్నాడు.

నిద్ర మత్తులో మంచంపై నుండి కిందకి పడ్డాడు.అంతే ఇంకా.

Advertisement

పడినోడు పడినట్టే ప్రాణాలు విడిచాడు.అతను మిజోరం రాష్ట్రానికి చెందిన లాల్ నుంచమ అని మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం, బొమ్మరాశిపేటలోని ఓ రిసార్ట్స్‌లో పనిచేస్తున్నాడు అని పోలీసులు చెప్పుకొచ్చారు.

అయితే పార్టీలో తాగిన అనంతరం అతనికి కేటాయించిన రూమ్ లో పడుకున్నాడు.అయితే అర్ధరాత్రి వేళ తన తోటి స్నేహితుడు అతను కింద పడటం చూసి అతన్ని లేపాగా అతనిలో ఏ మాత్రం కదిలిక లేదు.దీంతో రిసార్ట్స్ సిబ్బందికి సమాచారం అందించగా వారు పోలీసులకు, 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.108 సిబ్బంది లాల్ కు పరీక్షలు చెయ్యగా అతను మృతి చెందినట్టు నిర్దారించారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కానీ నిద్ర మత్తులో నుండి కింద పడిన వ్యక్తి ఇలా కూడా మరణిస్తాడా? అని షాక్ కు గురి చేసేలా అతని మరణం ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ? 
Advertisement

తాజా వార్తలు