ఫోన్‌లో ఎక్కువగా చదివే అలవాటుందా.. ఈ యాప్స్‌పై ఓ లుక్కేయండి!

ఇంటర్నెట్‌లో ఆర్టికల్స్‌, బుక్స్, కథలు చదివేవారు చాలామంది ఉంటారు.వాటిలో బాగా నచ్చినవి అప్పటికప్పుడే చదువుతారు.

 Are You In The Habit Of Reading A Lot On Your Phone Take A Look At These Apps ,-TeluguStop.com

ఒకవేళ అప్పటికప్పుడు చదివే సమయం లేకపోతే తర్వాత చదవాలని అనుకుంటారు.ఇక ట్వీట్ల థ్రెడ్ కూడా బాగా ఉపయోగకరంగా అనిపించొచ్చు.

కానీ దాన్ని సేవ్ చేసుకోవడానికి వెసులు బాటు దొరకకపోవచ్చు.ఈ కారణాల వల్ల వాటిని కాలక్రమేణా మర్చిపోవడం చాలామందికి అలవాటే.

అయితే వీటన్నిటికి చెక్ పెట్టేందుకు బుక్‌మార్కింగ్‌ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.ఆర్టికల్స్, ట్విటర్‌ థ్రెడ్స్‌, వెబ్‌సైట్లను సేవ్‌ చేసుకుని.కావలసినప్పుడు చదువుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.

1.మ్యాటర్‌

మ్యాటర్‌ యాప్‌ సేవ్‌ చేసిన ఆర్టికల్స్‌ డేట్స్‌ ప్రకారం ఒక చక్కటి లిస్టులో చూపిస్తుంది.ఆ లిస్టును యాక్సెస్ చేయడం ద్వారా సేవ్ చేసిన అన్ని డిజిటల్ కంటెంట్ చదువుకోవచ్చు.

ఈ యాప్ ఉపయోగించి ముందుగా చదవాలని అనుకున్నవి పైన వరుసలో కనిపించేలా సెట్ చేసుకోవచ్చు.ఈ యాప్ ఐఓఎస్‌ డివైజ్‌లు, వెబ్‌లో అందుబాటులో ఉంటుంది.

Telugu Articles Apps, Bookmark Apps, Phone, Habit, Tech, Tech Tips-Latest News -

2.ఇన్‌స్టా పేపర్

ఇన్‌స్టాపేపర్‌ యాప్‌లో ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.ఆ తర్వాత ఆ అకౌంట్‌లో లక్షల కొద్ది ఆర్టికల్స్, వీడియోలు, ఇతర కంటెంట్‌ను సేవ్‌ చేసుకోవచ్చు.సేవ్డ్‌ ఆర్టికల్స్‌లో ఇష్టమైన వాటిని హైలెట్ కూడా చేయొచ్చు.సేమ్ చేసిన వాటన్నిటినీ సెర్చ్ కూడా చేయొచ్చు.

3.పాకెట్‌

ఆర్టికల్స్ స్కాన్‌ చేసుకోవడానికి బాగా ఉపయోగపడే యాప్ పాకెట్‌.ఆన్‌లైన్‌లో ఏ సైట్‌లో ఉన్నా సరే వీడియోలు, ఆర్టికల్స్, ఇతర వాటన్నిటినీ ఈ యాప్ సహాయంతో సేవ్‌ చేసుకోవచ్చు.

ఇందులోని ‘బెస్ట్‌ ఆఫ్‌ ద వెబ్‌’ అని పిలిచే ఫీచర్ లేటెస్ట్ గా సేవ్ చేసుకున్న వాటిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.ఫ్రీగానే డౌన్‌లోడ్‌ చేసుకొని దీనిని వాడొచ్చు.

ప్రీమియం వెర్షన్ తీసుకుంటే మీరు సేవ్‌ చేసిన ఆర్టికల్స్ పర్మినెంట్‌గా సేవ్ అవుతాయి.దీనర్థం ఒక వెబ్‌సైట్‌ లోని ఏదైనా ఆర్టికల్‌ ఒరిజినల్ సోర్స్‌లో డిలీట్ అయిపోయినా ఈ యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube