చలనచిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి వారిలో దివంగత నటి శ్రీదేవి ( Sridevi ) ఒకరు.ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలోను విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి శ్రీదేవి అగ్ర హీరోలు అందరి సరసన నటించి అన్ని భాషలలోనూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈమె అనంతరం హీరోయిన్గా అడుగు పెట్టారు.ఇలా హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు పొందడమే కాకుండా ఎన్నో అవార్డులు సత్కారాలను కూడా పొందారు.

ఇక శ్రీదేవికి బోనీ కపూర్ ( Bhoney Kapoor ) కంటే ముందుగానే బాలీవుడ్ హీరో తో వివాహం జరిగింది అయితే కొంతకాలం తర్వాత ఆయనతో విభేదాలు రావడం విడిపోవడం అనంతరం బోనీకపూర్ తనని పెళ్లి చేసుకోవడం జరిగింది.ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.జాన్వీ కపూర్( Janhvi Kapoor) ఇప్పటికే హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక ఖుషి కపూర్( Kushi Kapoor ) కూడా ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇలా వీరిద్దరూ శ్రీదేవి వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇకపోతే తాజాగా బోనీ కపూర్ ఓ కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి మరణం గురించి తన పిల్లల గురించి పలు విషయాలను వెల్లడించారు.

శ్రీదేవి మరణించడంతో ఆమెది సహజ మరణం కాదని ఆమె మరణం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందని ఇన్ని రోజులు పాటు సందేహాలను వ్యక్తం చేశారు.తాజాగా బోనీ కపూర్ మాట్లాడుతూ శ్రీదేవి సహజ మరణం కాదని ఆమె ఎక్కువగా డైట్ చేయటం వల్ల లో బీపీ కారణంగా కళ్ళు తిరిగి పడిపోయేది అలా ప్రమాదవశాత్తు ఆమె నీటిలో పడి మరణించి ఉంటుందని బోనీకపూర్ తెలిపారు.ఇక వీరి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ గురించి కూడా గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.పెళ్లికి ముందే శ్రీదేవి ప్రెగ్నెంట్ అని అయితే ఆ ప్రెగ్నెన్సీకి కారణం బోనీకపూర్ కాదని, గర్భంతో ఉన్న శ్రీదేవిని ఈయన పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇలా జాన్వీ కపూర్( Janhvi Kapoor) బోని కపూర్ కుమార్తె కాదు అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తల పై స్పందించినటువంటి ఈయన తన కుమార్తె గురించి వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు.పెళ్లికి ముందే శ్రీదేవి( Sridevi ) ప్రెగ్నెంట్ అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఈయన కొట్టిపారేశారు.జాన్వీ నాకు శ్రీదేవికి కలిగిన సంతానమేనని తను మా బిడ్డనని ఈయన తెలిపారు.
నా రెండో వివాహం శ్రీతో 1996 మే 2వ తేదీన షిర్డీలో జరిగింది.ఆ తర్వాత ఆ మరుపటి సంవత్సరం జనవరిలో ఆమె గర్భం దాల్చింది.జాన్వి మా పెళ్లికి ముందే జన్మించిందని రూమర్లు పుట్టించారు.కాని అది నిజం కాదనీ ఈ సందర్భంగా బోని కపూర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







