బీజేపీ కార్యాలయం వద్ద బాంబుల కలకలం.. ఎక్కడంటే.. ?

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

ఇదివరకే ఇక్కడ ఉన్న బీజేపీ కార్యాలయాన్ని గతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా కోల్‌కతా ఖిద్దర్‌పూర్‌ హేస్టింగ్‌ క్రాసింగ్‌ ఏరియాలో బీజేపీ ఏర్పాటు చేసుకున్న కార్యాలయం సమీపంలో మరోసారి బాంబులు కలకలం సృష్టించాయి.ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పండ్ల ప్యాకింగ్‌కు వినియోగించే నాలుగు సంచుల్లో బాంబులను గుర్తించి వెంటనే బాండ్‌ స్క్వాడ్‌, యాంటీ రౌడీ స్క్వాడ్‌ విభాగానికి సమాచారం అందించారట.

దీంతో ఆ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని 50కిపైగా ముడి బాంబులను స్వాధీనం చేసుకున్నాయి.కాగా ఈ ఘటన శనివారం రాత్రి జరిగిందని సమాచారం.

ఇకపోతే ఇక్కడికి బాంబులు రావడానికి కారణం అయిన వారి కోసం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారట పోలీసులు.ఇక పెద్ద మొద్దంలో ఉన్న పేలుడు పదార్ధాలు ఒకవేళ పేలి ఉంటే తీవ్ర నష్టం జరిగేదని ఓ సీనియర్‌ అధికారి తెలుపుతున్నారంటే తృటిలో ప్రాణాపాయం నుండి ఇక్కడి వారు తప్పించుకున్నట్లే.

Advertisement
కుటుంబంలో గొడవలు మనోజ్ ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి... వీడియో వైరల్!

తాజా వార్తలు