ముఖ్యమంత్రి ఇంటివద్ద బాంబు కలకలం..!!

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద బాంబు ఉందంటూ అధికారులకు సమాచారం వచ్చింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే.

 Bomb Explosion At Chief Minister's Yogi Adityanath House, Up Cm Yogi Adityanat-TeluguStop.com

సీఎం ఇంటి వద్ద ఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయడం ప్రారంభించింది.ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లో హై అలెర్ట్ కూడా ప్రకటించడం జరిగింది.

యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయటం జరిగింది.ఎంత తనిఖీలు చేసినా బాంబ్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తప్పుడు సమాచారం అని భావిస్తున్నారు.

పూర్తి విషయంలోకి వెళ్తే ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికార నివాసం వద్ద బాంబు ఉన్నట్లు తెలిపాడు.

Telugu Bomb, Bombministers, Uttar Pradesh-Latest News - Telugu

దీంతో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది మరియు అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం అందించి బాంబు నిర్వీర్య స్క్వాడ్ నీ రంగంలోకి దింపడం జరిగింది.సీఎం ఇంటి వద్ద ఇంక చుట్టుప్రక్కన పరిసర ప్రాంతాల్లో అన్నిచోట్ల… తనిఖీలు చేశారు.అయితే ఎక్కడా కూడా బాంబు ఆచూకీ లభించకపోవడంతో అది ఫేక్ కాల్ అనీ నిర్ధారించారు.

బాంబు ఆచూకీ దొరకకపోయినప్పటికీ… ముఖ్యమంత్రి యోగి నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదట్టం చేయడం జరిగింది.ఇక ఇదే సమయంలో ఫేక్ సమాచారం అందించిన ఆగంతకుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube