ముఖ్యమంత్రి ఇంటివద్ద బాంబు కలకలం..!!
TeluguStop.com
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద బాంబు ఉందంటూ అధికారులకు సమాచారం వచ్చింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే.సీఎం ఇంటి వద్ద ఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయడం ప్రారంభించింది.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లో హై అలెర్ట్ కూడా ప్రకటించడం జరిగింది.
యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయటం జరిగింది.
ఎంత తనిఖీలు చేసినా బాంబ్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తప్పుడు సమాచారం అని భావిస్తున్నారు.
పూర్తి విషయంలోకి వెళ్తే ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికార నివాసం వద్ద బాంబు ఉన్నట్లు తెలిపాడు.
"""/"/
దీంతో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది మరియు అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం అందించి బాంబు నిర్వీర్య స్క్వాడ్ నీ రంగంలోకి దింపడం జరిగింది.
సీఎం ఇంటి వద్ద ఇంక చుట్టుప్రక్కన పరిసర ప్రాంతాల్లో అన్నిచోట్ల.తనిఖీలు చేశారు.
అయితే ఎక్కడా కూడా బాంబు ఆచూకీ లభించకపోవడంతో అది ఫేక్ కాల్ అనీ నిర్ధారించారు.
బాంబు ఆచూకీ దొరకకపోయినప్పటికీ.ముఖ్యమంత్రి యోగి నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదట్టం చేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో ఫేక్ సమాచారం అందించిన ఆగంతకుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
దేవర బ్యూటీ దశ తిరిగిందిగా.. ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ దక్కిందా?